News April 5, 2025

NRPT: ‘రేషన్ షాపులకు సన్న బియ్యం రవాణా వేగవంతం చేయాలి’

image

లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రేషన్ దుకాణాలకు బియ్యం పంపిణీ వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీపై శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట అధికారులు పాల్గొన్నారు. సన్న బియ్యం పంపిణీపై కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. రూ.13 వేల కోట్ల ఖర్చుతో బియ్యం అందిస్తున్నామన్నారు.

Similar News

News September 17, 2025

విలీనం కాకపోతే TG మరో పాక్‌లా మారేది: బండి

image

TG: సర్దార్ వల్లభాయ్ పటేల్‌ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘భారత్‌లో TG విలీనం కాకుంటే మరో పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లా ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేది. జలియన్ వాలాబాగ్‌ను మించి పరకాల, బైరాన్‌పల్లి, గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపాతం సృష్టించారు. ఈ దురాగతాలను చరిత్రకారులు విస్మరించారు. రాష్ట్ర ప్రభుత్వం విమోచన ఉత్సవాలను నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు.

News September 17, 2025

నూతనకల్: సామన్య ప్రజలతో గడీపై దాడి

image

తెలంగాణ సాయుధ పోరాట సమయంలో నూతనకల్ మండలం ఎర్రపహాడ్‌కి చెందిన జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి దేశ్ ముఖ్ ఆధీనంలో లక్షా 50 వేల ఎకరాల భూమి ఉంది. ఎర్రపహాడ్‌లో సువిశాలమైన గడీలో రజాకార్లు ఉండటాన్ని పసిగట్టిన దాయం రాజిరెడ్డి, భీంరెడ్డి కొండల్ రెడ్డి దళాల నాయకత్వంలో ప్రజలను పోగుచేసి బాంబులతో గడీలపై దాడి చేశారు. ఇప్పటికీ ఆ గడీ అలానే ఉంది.

News September 17, 2025

ఆదిలాబాద్ జిల్లా వెదర్ అప్‌డేట్

image

ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8:30 గంటల వరకు కాస్త ఎడతెరిపినిచ్చాయి. ఆదిలాబాద్ రూరల్ మండలంలో 13.8 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. జిల్లాలో అక్కడక్కడ చిరు జల్లులు మాత్రమే కురిశాయి. రైతులు వాతావరణ పరిస్థితులు గమనించి సాగు పనులు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.