News April 5, 2025
నంద్యాలకు రైలులో ప్రయాణించిన మంత్రి ఫరూక్

మంత్రి ఫరూక్ తన హోదాని పక్కనపెట్టి సాధారణ పౌరుడిగా రైలులో ప్రయాణించారు. విజయవాడ నుంచి నంద్యాలకు రైలులో బయలుదేరారు. ప్రజలతో మమేకమవుతూ, సమస్యలపై ఆరా తీస్తూ తన ప్రయాణాన్ని సాగించారు. ఇది చూసిన ప్రయాణికులు మంత్రి సింప్లిసిటీని ప్రశంసించారు. ప్రజాధనం వృథా చేయకుండా మంత్రి నిర్ణయం భేష్ అంటూ కొనియాడారు.
Similar News
News April 13, 2025
ఇందిరమ్మ ఇళ్లపై సీఎం కీలక సూచనలు

TG: ఇందిరమ్మ ఇళ్లను మొదటి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే కేటాయించాలని CM రేవంత్ స్పష్టం చేశారు. ఈ పథకం పారదర్శకంగా, నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని ఉన్నతస్థాయి సమావేశంలో సూచించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్తగా పని చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సిమెంట్, స్టీల్ తదితర సామగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News April 13, 2025
NZB: చేపలు పట్టేందుకు వెళ్లి బావ, బావమరిది మృతి

చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేటలో చోటు చేసుకుంది. మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, అతని బావమరిది మహమ్మద్ రఫీక్ శుక్రవారం సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫిక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతన్ని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగగా ఇద్దరు మునిగిపోయారు. మృతదేహాలను వెలికి తీసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News April 13, 2025
ఇల్లు కొనాలనే తొందరలో తప్పులొద్దు!

సొంతిల్లు కొనాలనే తొందరలో కొందరు చేసే చిన్న తప్పులే మున్ముందు చాలా ఇబ్బందులు తెస్తాయి. ముందుగా అసలు ఇల్లు ఎందుకు కొనాలని అనుకుంటున్నామో స్పష్టత ఉండాలి. ఏ ప్రాంతంలో కొంటున్నాం? అక్కడ వృద్ధి ఎలా ఉంటుంది? అద్దెకు ఇస్తే ఆదాయం ఎంతొస్తుంది? ముందుగా అనుకున్న దాని కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తున్నామా? తదితర ప్రశ్నలు వేసుకోకపోతే భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.