News April 5, 2025

నారాయణపేట జిల్లా ప్రజలకు WARNING

image

సైబర్ మోసగాళ్ల మాయమాటలు నమ్మొద్దని, కేటుగాళ్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ శుక్రవారం హెచ్చరించారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో లేదా టోల్ ఫ్రీ 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఆన్‌లైన్‌లో https://www.cybercrime.gov.in సైతం ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అపరిచితులకు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వకూడదన్నారు. SHARE IT

Similar News

News April 13, 2025

ATP: ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తి కాపాడిన పోలీసులు

image

కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని అనంతపురం జిల్లా యాడికి పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. స్థానికుల వివరాల మేరకు.. యాడికికి చెందిన గంజి శేఖర్ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు భార్య సౌమ్యకు వీడియో పంపాడు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వీరన్న టెక్నాలజీని ఉపయోగించి ఘటనా స్థలానికి వెళ్లి ఆత్మహత్య చేసుకోబోయిన గంజి శేఖర్‌ను కాపాడారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News April 13, 2025

మాజీ మంత్రి మనవడికి 444 మార్కులు  

image

ఇంటర్ ఫలితాల్లో మాజీ మంత్రి నారాయణస్వామి మనవడు గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ కృపాలక్ష్మి తనయుడు భువన తేజ సత్తా చాటాడు. MPC విభాగం మొదటి సంవత్సరంలో ఆయన 444 స్కోర్ చేశాడు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

News April 13, 2025

బుగ్గనకు వైఎస్ జగన్ కీలక పదవి!

image

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలకు చోటు దక్కింది. మాజీ మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్‌కు ఆ కమిటీలో చోటు కల్పిస్తూ వైసీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్‌గా మొత్తం 33 మందితో ఈ కమిటీని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. కమిటీలోని సభ్యులు జగన్‌కు రాజకీయ సలహాలు ఇవ్వనున్నారు.

error: Content is protected !!