News April 5, 2025

నారాయణపేట: ‘రెండు పార్టీలను నమ్మి మోసపోవద్దు’

image

పేద ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయని రెండు పార్టీలను ప్రజలు నమ్మకూడదని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నారాయణపేట అంబేడ్కర్ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల జీవితాలను ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. ఏడాదికి రూ.2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. 

Similar News

News December 24, 2025

విశాఖ: రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

image

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బుధవారం పరిహారం అందజేశారు. చిలకపల్లి రమేష్ హిట్‌ అండ్‌ రన్‌లో మరణించగా.. ఆయన భార్య చిలకపల్లి నీలమణి అకౌంట్‌లో రూ.2 లక్షలు జమ చేశామని సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఇప్పటి వరకు విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హిట్ అండ్ రన్‌‌ కేసుల్లో 102 మంది బాధితులకు మొత్తం రూ.84లక్షలు అందించినట్లు చెప్పారు.

News December 24, 2025

ప్రకాశం TDP పార్లమెంటరీ కమిటీ ఇదే.!

image

ప్రకాశం జిల్లా TDP పార్లమెంటరీ కమిటీని పార్టీ అధిష్టానం ప్రకటించింది. జిల్లా అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర, ప్రధాన కార్యదర్శిగా నాగేశ్వరరావు, పార్లమెంటరీ వైస్ ప్రెసిడెంట్లుగా మల్లికార్జునరెడ్డి, కాశయ్య, వెంకటసుబ్బయ్య, శ్రీను, ఆరిఫా, సుబ్బారావు, రామయ్య చౌదరి, నాగరాజులు నియమితులయ్యారు. అలాగే పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా 9 మంది, స్పోక్ పర్సన్లుగా 9 మందితో ఇతర కార్యవర్గాన్ని ప్రకటించారు.

News December 24, 2025

1.31 లక్షల మంది రైతులకు వ్యవసాయ పరికరాలు: తుమ్మల

image

TG: విపక్ష నేతల మాటలతో యాప్ అమలులో లేని జిల్లాల్లో రైతులు యూరియా ఎక్కువ కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎరువులపై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. త్వరలో రాష్ట్రమంతా యాప్ అమలు చేస్తామన్నారు. CM ఆదేశాలతో రైతు యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. దీనిద్వారా 1.31 లక్షల మంది రైతులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందిస్తామని చెప్పారు.