News April 5, 2025
బదనకల్: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

ముస్తాబాద్ మండలం బాదనకల్ గ్రామంలోని ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ గణేశ్ తెలిపారు. పోలీసుల వివరాలు.. పాతూరి మల్లమ్మ(54) గర్భకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఎన్ని హాస్పిటల్ తిరిగిన ఆమె వ్యాధి నయం కాలేదు. శుక్రవారం తన వ్యవసాయ పొలం వద్ద ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త రాంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.
Similar News
News February 27, 2026
విజయవాడలో ప్రియుడిని పట్టింటిన గర్ల్‌ఫ్రెండ్ ఫోన్‌కాల్..!

పోలీసుల కళ్లు కప్పి పరారైన నిందితుడిని ఎట్టకేలకు మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్‌లో డ్రగ్స్ తీసుకుంటున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిందితుడు రాజేష్ పోలీసుల నుంచి పరారయ్యాడు. రాజేష్‌కు గర్ల్ ఫ్రెండ్ ఉండగా ఆమెతో వేరే వారి ఫోన్ నుంచి నిందితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుతుండగా సాంకేతిక పరిజ్ఞానంతో అతణ్ని అదుపులోకి తీసుకొని గురువారం రిమాండ్‌కు తరలించారు.
News February 27, 2026
DRDOలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

<
News February 27, 2026
రూ. 250 కోట్ల భూమి.. సర్కారు నిర్ణయం ఏమిటో?

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత అనంతరం.. స్వాధీనం చేసుకున్న 31.07 ఎకరాల వినియోగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ భూమి విలువ సుమారు రూ. 250 కోట్లు ఉంటుందని కలెక్టరే ప్రకటించడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఖరీదైన ఈ భూముల్లో సామాన్యులకు ఉపయోగపడేలా ప్రభుత్వ భవనాలు లేదా ప్రజా ప్రయోజన నిర్మాణాలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.


