News March 26, 2024

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు సికింద్రాబాద్(SC), అగర్తల(AGTL) మధ్య విజయవాడ మీదుగా నడిచే వీక్లి స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నెం.07030 SC- AGTL మధ్య నడిచే రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం, నెం.07029 AGTL- SC మధ్య నడిచే రైలును ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్రవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు విజయవాడతో పాటు రాజమండ్రి, విశాఖ తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News July 8, 2024

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ షర్మిల

image

కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి కుటుంబ సమేతంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గాన బయలుదేరి విజయవాడకు వెళ్లారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

News July 8, 2024

కృష్ణా: కైకలూరులో మాజీ ఎమ్మెల్యేపై ఫ్లెక్సీల కలకలం

image

కైకలూరు మాజీ MLA దూలం నాగేశ్వరరావు 2019 నుంచి 2024 వరకు చేసిన అరాచకాలు అంటూ.. మంగళవారం పలుచోట్ల ఫ్లెక్సీలు కలకలం రేపాయి. నాగేశ్వరావు ఐదేళ్ల పాలనలో అనేక అక్రమాలు, ఆక్రమణలు, దౌర్జన్యాలు చేశారంటూ పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్లలో ప్లెక్సీ ఏర్పటు చేశారు. ఎమ్మెల్యే బాధితుల సంఘం అధ్యక్షుడు అంటూ వరప్రసాద్(బాబి) పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

News July 8, 2024

విజయవాడ: ఆర్‌ఐని సస్పెండ్ చేసిన సీపీ

image

పోలీసు సిబ్బందిపై అనుచితంగా వ్యవహరిస్తున్న ఆర్‌ఐ శ్రీనివాసరావును విజయవాడ కమిషనర్ రామకృష్ణ ఆదివారం సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా సిటీ సెక్యూరిటీ వింగ్‌లో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు తన క్రింది మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై విచారించి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని చెప్పారు.