News April 5, 2025

రిషభ్ పంత్ మళ్లీ ఫెయిల్

image

LSG కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. వరుసగా నాలుగో మ్యాచులోనూ ఆయన సత్తా చాటలేకపోయారు. ముంబైతో మ్యాచులో 2 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచారు. 4 మ్యాచుల్లో కలిపి పంత్ 19 పరుగులే చేశారు. దీంతో ఆయనపై SMలో మాజీలు, విశ్లేషకులు, క్రికెట్ ప్రేమికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా IPL మెగా వేలంలో పంత్‌ రూ.27 కోట్లు పలికి ఖరీదైన ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే.

Similar News

News April 5, 2025

వృద్ధి రేటులో తమిళనాడు ఫస్ట్, ఏపీ సెకండ్

image

2024-25కి గాను ఆర్థిక వృద్ధి రేటులో ఏపీ 8.21 శాతంతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. 9.69% వృద్ధితో తమిళనాడు తొలిస్థానం దక్కించుకుంది. ఆ తర్వాత రాజస్థాన్- 7.82%, హరియాణా- 7.55%, కర్ణాటక- 7.37%, మహారాష్ట్ర- 7.27%, తెలంగాణ- 6.79% ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది.

News April 5, 2025

రిటైర్డ్ హర్ట్.. రిటైర్డ్ ఔట్ తేడాలివే?

image

క్రికెట్‌లో రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ పదాలు ఒకేలా ఉన్నా వీటి మధ్య కాస్త తేడా ఉంటుంది. రిటైర్డ్ హర్ట్ అనగా బ్యాటర్ గాయంతో లేదా ఏదైనా ఇతర సమస్యతో మైదానాన్ని వీడుతారు. తిరిగి క్రీజులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రిటైర్డ్ ఔట్ అనగా ఇతర కారణాలతో ఇన్నింగ్సును కొనసాగించకుండా గ్రౌండ్‌ను వీడుతారు. తిరిగి క్రీజులోకి రావాలంటే ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అనుమతి అవసరం. నిన్న <<15996543>>తిలక్ రిటైర్డ్ ఔట్‌గా<<>> గ్రౌండ్ వీడారు.

News April 5, 2025

పీరియడ్స్ వల్ల పూజకు ఆటంకం.. మహిళ ఆత్మహత్య

image

UPలోని ఝాన్సీలో ప్రియాంశ సోనీ(36) అనే మహిళ నవరాత్రి పూజకు ముందు పీరియడ్స్ రావడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఛైత్ర నవరాత్రి పూజకు ముందు రోజు ఆమె కావాల్సిన సామగ్రి తెప్పించుకున్నారు. కానీ పీరియడ్స్ రావడంతో పూజ చేసుకోలేకపోయారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె విషం తాగి సూసైడ్‌కు పాల్పడ్డారు. పీరియడ్స్ అనేది ప్రతి నెలా సహజంగా జరిగేదేనని తాను నచ్చజెప్పినా సోనీ ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త తెలిపారు.

error: Content is protected !!