News April 5, 2025
సిరసనగండ్ల బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం సిరసనగండ్ల గ్రామంలో నేటి నుంచి జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎస్ఐ శంషుద్దీన్, అగ్నిమాపక ఇతర అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఎవరైనా భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News April 5, 2025
మేడ్చల్: 16 వేలు దాటిన దరఖాస్తులు..!

MDCL మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ‘యువ వికాస పథకం’ దరఖాస్తుల సంఖ్య 16 వేల మార్క్ దాటినట్లుగా జిల్లా అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఆదాయం ఉండాలన్నారు.
News April 5, 2025
అల్వాల్: TIMS ఆసుపత్రికి అనుబంధంగా కాలేజీలు!

అల్వాల్లో నిర్మిస్తున్న TIMS ఆసుపత్రిని గ్యాస్ట్రో సంబంధ వ్యాధుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మారుస్తున్నారు. దీనికి కుత్బుల్లాపూర్ మెడికల్, నర్సింగ్ కాలేజీలను అనుసంధానం చేయనున్నారు. అంతేకాక డాక్టర్లు, నర్సుల కొరత తీర్చేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. పీజీ కాలేజీ విద్యార్థులు కూడా అక్కడ వైద్యం అందించే అవకాశం ఉంటుంది.
News April 5, 2025
HYD: గుండె, గ్యాస్ట్రో, న్యూరో ఆసుపత్రులుగా TIMS

HYDలో నిర్మాణం సాగుతున్న సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ TIMS ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. సనత్‌నగర్ కార్డియాక్ స్పెషాలిటీ, అల్వాల్ గ్యాస్ట్రో, ఎల్బీనగర్ న్యూరో స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చనున్నారు. HYDలో గాంధీ, ఉస్మానియా జనరల్ ఆసుపత్రులుగా ఉండగా, గుండె, గ్యాస్ట్రో, న్యూరో స్పెషాలిటీ వైద్యం అందుబాటులో లేకపోగా ఈ TIMSలను మార్చనున్నారు.