News April 5, 2025
నెల క్రితం పెళ్లి.. వివాహిత ఆత్మహత్య!

కదిరి మండలం బోయరామన్నగారిపల్లి గ్రామానికి చెందిన చంద్రకళ (18) అనే యువతి శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు.. యువతి 45 రోజుల క్రితం కూటాగుళ్ల చెందిన చిన్న అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా ఆమె ప్రయుడిని పెళ్లాడింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు మాట్లాడలేదని మనస్తాపం చెంది ఉరేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.
Similar News
News April 5, 2025
ఏపీలో ఒకే ఒక్కడు.. అది మన కడపోడే

కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన నాగరాజు అరుదైన అవకాశాన్ని కైవసం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కూటమి ప్రభుత్వం మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌లను ప్రకటించింది. అందులో 31 టీడీపీ, 6 జనసేన, బీజేపీకి ఒకటి కేటాయించింది. ఇందులో బీజేపీ తరఫున యర్రగుంట్ల మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా రామిరెడ్డికి ఈ అవకాశం లభించింది. దీంతో ఆయనకు బీజేపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపాయి.
News April 5, 2025
భార్యను చంపాడని జైలు శిక్ష.. రెండేళ్ల తర్వాత ట్విస్ట్!

తప్పిపోయిన భార్యను హత్య చేశాడనే ఆరోపణతో ఓ భర్త రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. కర్ణాటకలోని కొడగుకి చెందిన సురేశ్ 2021లో తన భార్య మల్లిగే కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది తర్వాత పక్క ఊరిలో అస్థిపంజరం కనిపించడంతో అనుమానించి భర్తను అరెస్ట్ చేశారు. ఇటీవల మల్లిగే ఓ రెస్టారెంట్‌లో కనిపించడంతో సురేశ్ నిర్దోషిగా బయటకువచ్చాడు. అమాయకుడిని జైల్లో పెట్టారంటూ పోలీసులపై కోర్టు ఫైర్ అయింది.
News April 5, 2025
మచిలీపట్నం: సద్గుణాలు కలిగిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్ రామ్: ఎస్పీ

మానవ తావాదం, ఆదర్శవాదం వంటి సద్గుణాలు కలిగిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. జగ్జీవన్ రామ్ 117వ జయంతిని జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీస్‌లో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ ఇతర పోలీస్ అధికారులతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.