News April 5, 2025
కడప: ‘ఈ శ్రమ్ పోర్టల్ నందు కార్మికులు పేర్లు నమోదు చేసుకోవాలి’

కడప జిల్లా పరిధిలో వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు తమ పేర్లు ఈ శ్రమ్ పోర్టల్ నందు పేర్లు నమోదు చేసుకోవాలి అని ఉప కమిషనర్ శ్రీకాంత్ నాయక్ పేర్కొన్నారు. ఈ శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకొనుటకు ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలని సూచించారు. 18 నుంచి 59 సంవత్సరాల వయసు గల వారు అర్హులని తెలిపారు.
Similar News
News April 6, 2025
కడప జిల్లాలో వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

మైనర్ బాలికను మోసంచేసి పిల్లలు కలిగేలా చేసిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు బీ కొత్తకోట సీఐ జీవన్ గంగానాథ బాబు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామంలోని వ్యక్తి మాయమాటలతో లొంగదీసుకుని గర్భం దాల్చేలా చేసినట్లు చెప్పారు. అనంతరం ఆమెను తీసుకెళ్లి కర్ణాటకలో అబార్షన్ చేయించడానికి ప్రయత్నించడంతో అక్కడి పోలీసులు, బాధితురాలి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
News April 6, 2025
ఒంటిమిట్టలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే సీతారామలక్ష్మణ మూర్తులను అర్చకులు పట్టు వస్త్రాలు పుష్పాలతో సుందరంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉదయం 9-30 గంటలకు ధ్వజావరోహణం కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.
News April 5, 2025
సిద్దవటం: బావిలో ఈతకొడుతూ ఫిట్స్.. విద్యార్థి మృతి

సిద్దవటం మండలంలోని ముమ్మడిగుంటపల్లిలో శనివారం విషాదం నెలకొంది. గ్రామస్థుల వివరాల ప్రకారం వ్యవసాయ పొలాల్లోని బావిలో శనివారం ఈతకొడుతూ 10వ తరగతి విద్యార్థి తమ్మిశెట్టి శ్రీనివాసులు మృతి చెందాడు. ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లికి చెందిన తమ్మిశెట్టి శ్రీనివాసులు స్నేహితులతో కలిసి ముమ్మడిగుంటపల్లి వ్యవసాయ పొలాల్లోని బావిలో ఈతకొడుతూ బయటకు రాగానే ఫిట్స్ వచ్చి మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.