News March 26, 2024

BREAKING: పెట్రోల్ పంప్స్ డీలర్ల కీలక నిర్ణయం

image

TG: రాష్ట్రంలోని పెట్రోల్ పంప్స్ డీలర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధనంపై కమీషన్ పెంచాలని వారు డిమాండ్ చేస్తూ కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. 10రోజుల్లో కేంద్రం స్పందించకుంటే పెట్రోల్ బంక్స్ ప్రతి రోజు కేవలం 12గంటలే తెరిచి నిరసనలు తెలపనున్నారు. అంటే ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే పెట్రోల్ పంపులు తెరిచి ఉంటాయి.

Similar News

News April 3, 2026

హార్ముజ్ To ఇండియా.. షిప్‌కు ఎంత టైమ్ పడుతుంది?

image

ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధి నుంచి షిప్స్/ట్యాంకర్లు భారత పశ్చిమ తీరానికి చేరుకోవడానికి లోడు, రూట్‌ను బట్టి సాధారణంగా 2-3 రోజులు పడుతుంది. సుమారు 1000KM దూరంలోని కాండ్లా(GJ) పోర్టుకు 36-40 గంటల్లో నౌకలు చేరుకుంటాయి. ముంబై(MH)కి రావడానికి 50-55 గంటలు అవుతుంది. ఆయిల్ ట్యాంకర్లు సగటున గంటకు 24-37 KM వేగంతో ప్రయాణిస్తాయి. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్‌ను ఇరాన్ మూసేయడం తెలిసిందే.

News April 3, 2026

BREAKING: పెరిగిన బంగారం ధర

image

నిన్న భారీగా తగ్గిన బంగారం ధర ఇవాళ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,960 పెరిగి రూ. రూ.1,50,930కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 ఎగబాకి రూ.1,38,350 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,55,000గా ఉంది.

News April 3, 2026

ECIL, హైదరాబాద్‌లో 32 ఉద్యోగాలు

image

కాంట్రాక్ట్ ప్రాతిపదికన 32 పోస్టుల భర్తీకి ECIL, హైదరాబాద్‌.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-14, టెక్నికల్‌ ఆఫీసర్‌-8, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-3, సీనియర్‌ ఆర్టీజన్‌-7 ఉన్నాయి. సంబంధిత ట్రేడ్‌లో ITI/డిప్లొమా/BE/బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. వయసు 30-33 మధ్య ఉండాలి. APR- 9,18న ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు www.ecil.co.in చూడండి.