News April 5, 2025
BREAKING: పపువా న్యూగినియాలో భారీ భూకంపం

పపువా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైంది. యూఎస్ సునామీ వార్నింగ్ సెంటర్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రం 49 కి.మీ లోతున ఉన్నట్లు అధికారులు తెలిపారు. గంట వ్యవధిలోనే మూడు సార్లు భూమి కంపించినట్లు పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మయన్మార్‌లో సంభవించిన భూకంపంలో దాదాపు 3000 మంది మరణించిన విషయం తెలిసిందే.
Similar News
News April 5, 2025
రైతులను వ్యాపారవేత్తలుగా మార్చుతాం: శ్రీధర్ బాబు

TG: ట్రంప్ టారిఫ్స్ విధానంతో భారత్‌కు ఒక విధంగా మేలే జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇండియా, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రతినిధుల సదస్సులో ఆయన మాట్లాడారు. సుంకాల పెంపుతో ఇతర దేశాల వ్యాపారవేత్తలు భారత్ వైపు చూస్తున్నారన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించి రైతులను వ్యాపారవేత్తలుగా మార్చుతామని తెలిపారు.
News April 5, 2025
మావోయిస్టు మిత్రులారా లొంగిపోండి: షా

బుల్లెట్లు, బాంబులతో అభివృద్ధిని అడ్డుకోలేరని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌గఢ్ పర్యటనలో ఉన్న ఆయన మావోయిస్టు మిత్రులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. బస్తర్‌లో హింసకు త్వరలోనే ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు. మావోలను కోల్పోవడం ఎవరికీ ఇష్టం ఉండదని, వారంతా లొంగిపోయి బస్తర్ అభివద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కాగా ఇటీవల ఛత్తీస్‌గఢ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో వందలమంది మావోలు మరణించారు.
News April 5, 2025
NTR లుక్‌పై అభిమానుల ఆందోళన!

యంగ్ టైగర్ NTR కొత్త లుక్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘NTR-NEEL’ సినిమా కోసం ఆయన ఒక్కసారిగా బరువు తగ్గారు. ఎన్టీఆర్ అంటే కాస్త చబ్బీగా కండలు తిరిగిన బాడీతో ఉండాలని, ఇంత స్లిమ్ అవ్వడం ఏంటని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ లుక్ ఆయనకు సూట్ కాలేదని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే కొందరేమో స్లిమ్‌గా అదిరిపోయారు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ లుక్ మీకెలా అనిపించింది? COMMENT