News April 5, 2025
గుప్తా నిధులంటూ రూ.4.50లక్షలు కాజేశారు:నిర్మల్ ASP

గుప్త నిధులు ఉన్నాయని ఓ వ్యక్తిని నలుగురు దుండగులు నమ్మించి రూ.4,50,000 కాజేసిన ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటనపై నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ రాజేష్ మీనా ప్రెస్ మీట్ నిర్వహించారు. అగ్బర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి 3 నిందితులను పట్టుకొని రిమాండ్‌కి పంపినట్లు తెలిపారు.
Similar News
News April 5, 2025
ప్రముఖ హాలీవుడ్ నటుడు మృతి

ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ ట్రేబర్(71) కన్నుమూశారు. లుకేమియాతో బాధపడుతున్న ఆయన స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్నారు. దాని వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్‌తో మరణించారు. సూపర్ హిట్‌గా నిలిచిన హెర్క్యులస్ అండ్ లాస్ట్ కింగ్డమ్, హెర్క్యులస్: ది లెజెండరీ జర్సీస్, యూనివర్సల్ సోల్జర్, సన్ ఆఫ్ సామ్, ఔట్ ఆఫ్ ది డార్క్నెస్ తదితర చిత్రాలతో పాటు పలు టీవీ షోలలోనూ ఆయన కీలక పాత్రలు పోషించారు.
News April 5, 2025
దామెర: తండ్రికి తల కొరివి పెట్టిన కుమార్తె..!

హనుమకొండ జిల్లా దామెర మండల పరిధి లాదెల్ల గ్రామంలో లాదెల్ల బిక్షపతి శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. భిక్షపతికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు లేకపోవడంతో కుమారుడి బాధ్యత పెద్ద కుమార్తె అయిన శోభారాణి తీర్చారు. మృతుడి దహన సంస్కారాలకు హాజరైన బంధుమిత్రులు, గ్రామ ప్రజలు శోభారాణి తలకొరివి పెట్టడం చూసి కన్నీరు మున్నీరయ్యారు.
News April 5, 2025
సినిమాలను వృత్తిగా చూడలేదు: తమన్నా

ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా కొనసాగుతున్నందుకు హీరోయిన్ తమన్నా సంతోషం వ్యక్తం చేశారు. స్కూల్ డేస్‌లోనే సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపారు. చదువు విషయంలో టీచర్లు తనకు ఎంతగానో సహకరించారని చెప్పారు. తన 21వ పుట్టిన రోజున పేపర్లో తనపై వచ్చిన ప్రత్యేక కథనం చూసి కన్నీరు పెట్టుకున్నట్లు వెల్లడించారు. సినిమాలను తానెప్పుడూ వృత్తిగా చూడలేదన్నారు. కాగా తమన్నా నటించిన ‘ఓదెల2’ ఈ నెల 17న రిలీజ్ కానుంది.