News April 5, 2025
SRD: అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్ క్రాంతి

సన్న బియ్యం పంపిణీలో డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వల్లూరు క్రాంతి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన బియ్యం అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. అంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Similar News
News April 5, 2025
SRPT SP కార్యాలయంలో జగ్జీవన్ జయంతి

భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎస్పీ నరసింహ బాబూ జగ్జీవన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన ఎనలేని కృషి చేశారని తెలిపారు. మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. పోలీస్ సిబ్బంది ఉన్నారు.
News April 5, 2025
మేడ్చల్: 16 వేలు దాటిన దరఖాస్తులు..!

MDCL మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ‘యువ వికాస పథకం’ దరఖాస్తుల సంఖ్య 16 వేల మార్క్ దాటినట్లుగా జిల్లా అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఆదాయం ఉండాలన్నారు.
News April 5, 2025
అల్వాల్: TIMS ఆసుపత్రికి అనుబంధంగా కాలేజీలు!

అల్వాల్లో నిర్మిస్తున్న TIMS ఆసుపత్రిని గ్యాస్ట్రో సంబంధ వ్యాధుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మారుస్తున్నారు. దీనికి కుత్బుల్లాపూర్ మెడికల్, నర్సింగ్ కాలేజీలను అనుసంధానం చేయనున్నారు. అంతేకాక డాక్టర్లు, నర్సుల కొరత తీర్చేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. పీజీ కాలేజీ విద్యార్థులు కూడా అక్కడ వైద్యం అందించే అవకాశం ఉంటుంది.