News April 5, 2025
MHBD: భద్రాచలానికి RTC ప్రత్యేక బస్సులు

భద్రాచలంలో జరుగు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి మహబూబాబాద్ డిపో నుంచి 5 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఎం శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈనెల నెల 6వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు నడుస్తాయన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వెళ్లే మహబూబాబాద్ పరిసర ప్రజలు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News December 31, 2025
పోలవరం ఇంఛార్జ్‌లుగా అల్లూరి జిల్లా అధికారులు

అల్లూరి జిల్లా అధికారులను నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాకు ఇంఛార్జ్‌లుగా నియమించారు. ఈ మేరకు ఏపీ సీఎస్ విజయానంద మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పడిన పోలవరం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్‌గా ఏఎస్ దినేష్ కుమార్, ఇంఛార్జ్ ఎస్పీగా అమిత్ బర్ధర్, ఇంఛార్జ్ జేసీగా పాడేరు ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీపూజను నియమించారు.
News December 31, 2025
గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా?

మహిళల గర్భాశయంలో ఏర్పడే గడ్డలనే ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి రకరకాల పరిమాణాల్లో ఏర్పడతాయి. ఫైబ్రాయిడ్స్ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడడం మూలంగా మూత్రసంబంధ సమస్యలు వస్తాయి. ✍️ ఫైబ్రాయిడ్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.
News December 31, 2025
అనంతపురం, సత్యసాయి జిల్లాల న్యూస్ రౌండప్

☞ బొకేలు వద్దు.. పుస్తకాలు తెండి: సత్యసాయి కలెక్టర్
☞ న్యూ ఇయర్.. హద్దు మీరితే చర్యలే: ఎస్పీలు
☞ నేడు, రేపు జిల్లాలో అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు
☞ అనంతపురం JNTU బీటెక్ ఫలితాలు విడుదల
☞ జనవరిలో కందుల కొనుగోళ్లు
☞ JAN 5న బొమ్మనహల్ ఎంపీపీ ఎన్నిక
☞ కళ్యాణదుర్గం: ఇద్దరు దొంగల అరెస్ట్.. 32 బైక్‌లు స్వాధీనం
☞ జిల్లాలో 4,950 మె.టన్నుల యూరియా


