News April 5, 2025

LSG విజయం.. గోయెంకా సంతోషం..!

image

ఐపీఎల్‌లో ముంబైతో విజయం అనంతరం LSG ఓనర్ సంజీవ్ గోయెంకా చిరునవ్వులు చిందించారు. కెప్టెన్ రిషభ్ పంత్, సిబ్బందితో కలిసి ఆయన స్టేడియంలో సంతోషంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు ఎన్నాళ్లకెన్నాళ్లకు గోయెంకా నవ్వారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఎల్ఎస్‌జీని రెండు వరుస ఓటములు పలకరించడంతో రిషభ్ పంత్‌పై గోయెంకా సీరియస్ అయిన విషయం తెలిసిందే.

Similar News

News April 5, 2025

హత్తుకునే కథతో 7/G సీక్వెల్: సెల్వ రాఘవన్

image

7/G బృందావన్ కాలనీ సీక్వెల్ షూట్ 50% పూర్తయ్యిందని డైరెక్టర్ సెల్వ రాఘవన్ వెల్లడించారు. మనసును హత్తుకునే కథతో రెడీ చేస్తున్నామన్నారు. హీరోయిన్ చనిపోయాక హీరో(రవికృష్ణ) జీవితం ఎలా సాగిందనే అంశాలతో రూపొందిస్తున్నట్లు తెలిపారు. ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్‌పై మాట్లాడుతూ ‘ఇది క్లిష్టమైన కథ. భారీగా ఖర్చవుతుంది. నిర్మాత కోసం చూస్తున్నాం. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తారు. కార్తి కూడా ఉంటారు’ అని చెప్పారు.

News April 5, 2025

PBKSvsRR: పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

image

PBKSతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 205/4 స్కోర్ చేసింది. జైస్వాల్ 67, శాంసన్ 38, రియాన్ పరాగ్ 43*, నితీశ్ రాణా 12, హెట్‌మయర్ 20 పరుగులు చేశారు. ఫెర్గ్యూసన్ 2, మార్కో జాన్‌సెన్, అర్ష్‌దీప్ చెరో వికెట్ తీశారు. విజయం కోసం పంజాబ్ 206 రన్స్ చేయాలి.

News April 5, 2025

1996 WC విన్నింగ్ క్రికెటర్లతో మోదీ భేటీ

image

శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడి లెజెండరీ క్రికెటర్లతో సమావేశమయ్యారు. 1996 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యులైన జయసూర్య, అరవింద డిసిల్వా సహా పలువురు ప్లేయర్లతో ముచ్చటించారు. అలాగే 1987-90 మధ్య శ్రీలంక శాంతి, సమగ్రత కోసం ప్రాణాలను అర్పించిన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్(IPKF) స్మారకం(కొలంబో) వద్ద నివాళులర్పించారు. ఆ సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని ట్వీట్ చేశారు.

error: Content is protected !!