News April 5, 2025
నేడు ముప్పాళ్లకు సీఎం చంద్రబాబు

AP: CM చంద్రబాబు ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు(M) ముప్పాళ్లలో జరిగే బాబు జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో CM మాట్లాడతారు. ఆ తర్వాత పార్టీ శ్రేణులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
Similar News
News April 5, 2025
ఏఐ ప్రజాస్వామ్యానికే పెను సవాల్ విసిరింది: సీఎం రేవంత్

TG: కంచ గచ్చిబౌలి వ్యవహారంలో AIని ఉపయోగించి వివాదం సృష్టించారని CM రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘AIతో నెమళ్లు ఏడ్చినట్లు, జింకలు గాయపడినట్లు ఫేక్ ఫొటోలు, వీడియోలు సృష్టించారు. వాటినే సెలబ్రిటీలు రీపోస్ట్ చేసి సమాజానికి తప్పుడు సందేశం పంపారు. ఈ వివాదం ప్రజాస్వామ్యానికే పెను సవాలు విసిరింది. దేశ సరిహద్దుల్లో ఘర్షణ జరుగుతోందంటూ ఫేక్ వీడియో క్రియేట్ చేస్తే యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంది’ అని అన్నారు.
News April 5, 2025
SBI PO ఫలితాలు విడుదల

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI PO ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. గత నెల 8, 16, 24, 26 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, DOB, క్యాప్చా ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ <
News April 5, 2025
శ్రీరామ నవమి వేడుకకు అయోధ్య సిద్ధం

శ్రీ రామ నవమి వేడుకకు అయోధ్య రామ మందిరం ముస్తాబైంది. ఎండల నేపథ్యంలో ప్రత్యేక వసతి కేంద్రాలు నిర్మించినట్లు అధికారులు తెలిపారు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక మార్గాలలో వాహనాలను పంపిస్తున్నారు. శ్రీరామ నవమి వేడుకలను భక్తులందరూ తిలకించేలా భారీ LED స్ర్కీన్లు సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.