News April 5, 2025
నేడు మంథని నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సు

శ్రీ రామనవమి కళ్యాణోత్సం కోసం మంథని నుంచి భద్రాచలం వరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినట్లు మంథని డీఎం శ్రావణ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి, ఆదివారం కళ్యాణోత్సవం తర్వాత సాయంత్రం 4 గంటలకు తిరిగి మంథనికి బయలు దేరుతుందని పేర్కొన్నారు. ఫుల్ టికెట్ రూ.450, హాఫ్ టికెట్ రూ.225, మహిళలకు ఉచిత పథకం ఉందని తెలిపారు.
Similar News
News April 5, 2025
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సీఎం సమీక్ష

TG: కంచ గచ్చిబౌలి భూముల కోర్టు కేసులు, ప్రభుత్వ తదుపరి కార్యాచరణపై CM రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఆ భూముల్లో గత 25ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని, ఎన్నడూ వణ్యప్రాణులు, పర్యావరణం వంటి వివాదాలు రాలేదని వారు CMకు వివరించారు. AI ఫేక్ వీడియోలతో గందరగోళం సృష్టించారని తెలిపారు. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, వీడియోలపై విచారణకు ఆదేశించేలా కోర్టును కోరాలని అధికారులకు CM సూచించారు.
News April 5, 2025
IPL: టాస్ గెలిచిన పంజాబ్

చండీగఢ్ వేదికగా రాజస్థాన్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.
RR: జైస్వాల్, సంజూ(C), నితీశ్, రియాన్, జురెల్, హెట్‌మయర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ,యుధ్‌వీర్, సందీప్ శర్మ
PBKS: ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్(C), స్టొయినిస్, వధేరా, మ్యాక్స్‌వెల్, శశాంక్, సూర్యాంశ్, జాన్‌సెన్, అర్ష్‌దీప్, ఫెర్గ్యూసన్, చాహల్
News April 5, 2025
ప్రముఖ హాలీవుడ్ నటుడు మృతి

ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ ట్రేబర్(71) కన్నుమూశారు. లుకేమియాతో బాధపడుతున్న ఆయన స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్నారు. దాని వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్‌తో మరణించారు. సూపర్ హిట్‌గా నిలిచిన హెర్క్యులస్ అండ్ లాస్ట్ కింగ్డమ్, హెర్క్యులస్: ది లెజెండరీ జర్సీస్, యూనివర్సల్ సోల్జర్, సన్ ఆఫ్ సామ్, ఔట్ ఆఫ్ ది డార్క్‌నెస్ తదితర చిత్రాలతో పాటు పలు టీవీ షోలలోనూ ఆయన కీలక పాత్రలు పోషించారు.