News April 5, 2025

నేడు IPLలో డబుల్ ధమాకా

image

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై వేదికగా సీఎస్కే-డీసీ తలపడనున్నాయి. ఈ మ్యాచుకు రుతురాజ్ గైర్హాజరీలో సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ వ్యవహరించే ఛాన్స్ ఉంది. మరోవైపు రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ ఢీకొననున్నాయి. వరుస విజయాలతో పంజాబ్ జోరు మీద ఉండగా, వరుస ఓటములతో రాజస్థాన్ డీలా పడింది. మరి ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

Similar News

News April 6, 2025

‘ఎంపురాన్’ మరో రికార్డ్

image

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘L2: ఎంపురాన్’ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు(దాదాపు ₹250Cr) సాధించిన చిత్రంగా నిలిచినట్లు కంప్లీట్ యాక్టర్ ట్వీట్ చేశారు. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు, టెక్నీషియన్లకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఇప్పటి వరకు టాప్‌లో ఉన్న మంజుమ్మల్ బాయ్స్(₹239Cr) రెండో స్థానానికి చేరింది.

News April 5, 2025

ఘోరం.. 13ఏళ్ల క్యాన్సర్ పేషంట్‌పై అత్యాచారం

image

మహారాష్ట్ర థానేలో అమానవీయ ఘటన జరిగింది. క్యాన్సర్‌తో పోరాడుతున్న 13 ఏళ్ల బాలికపై దుర్మార్గుడు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ముంబైలోని ఆస్పత్రిలో చిన్నారికి కీమోథెరపీ చేయిస్తుండగా రొటీన్ పరీక్షల్లో ఈ విషయం బయటికొచ్చింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక కుటుంబంతోపాటు నిందితుడు బిహార్‌కు చెందినవారని తెలిపారు. చిన్నారి చికిత్స కోసం ముంబైకి వచ్చినట్లు చెప్పారు.

News April 5, 2025

ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి: ఉత్తమ్

image

TG: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. డిసెంబర్‌లోపు మొదటిదశ పూర్తి కావాలని నీటిపారుదల శాఖపై సమీక్షలో అధికారులను ఆదేశించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెణ జలాశయాల పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసి, నీరు నిల్వ చేయాలని సూచించారు. అటు జూరాల ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపడతామని పేర్కొన్నారు.

error: Content is protected !!