News April 5, 2025
రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకోండి: కలెక్టర్

భద్రాద్రి జిల్లాలోని బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్ (EBC, EWS) నిరుద్యోగులైన యువతీ, యువకులు రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రాజీవ్ యువ వికాసం ద్వారా యువతీ, యువకులు ఆర్థిక అభివృద్ధి, స్వయం ఉపాధిని పెంపొందించుకునే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. tgobmmsnow.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఈనెల 14వతేదీ లోపు అప్లై చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 19, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 19, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.32 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు
✒ ఇష: రాత్రి 7.27 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 19, 2025
శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌గా రాజంపేట వాసి

శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌గా రాజంపేట పట్టణం వైబిఎన్ పల్లెకు చెందిన పోతుగుంట రమేశ్ నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నంద్యాల జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
News September 19, 2025
తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను ఈ ఆక్షన్‌లో చేర్చాలి

సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న జాదవ్ ఢిల్లీలోని బొగ్గు గనుల మంత్రిత్వశాఖలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అక్టోబర్ 2025లో జరగే బొగ్గు బ్లాక్ ఈ-ఆక్షన్ ప్రక్రియపై సింగరేణి సంస్థ తరఫున తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు బ్లాక్‌లను ఈ-ఆక్షన్ జాబితాలో చేర్చాలని కోరారు. ఈ సమావేశంలో మళ్లీ ప్రస్తావించారు. సింగరేణి సంస్థకు మాత్రమే కాకుండా రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనం కలుగుతుందన్నారు.