News March 26, 2024
భద్రాద్రి ఆలయ ఆఫీసులో మృతదేహం కలకలం

భద్రాద్రి ఆలయ ఆఫీసులో మృతదేహం కలకలం సృష్టించింది. రామాలయం సీఆర్‌ఓ కార్యాలయం పైఅంతస్తులోని బాత్రూంలో ఆఫీస్ సిబ్బంది మృతదేహాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు. మృతుడు ఖమ్మంకి చెందిన జాఫర్‌గా గుర్తించారు. ఆయన రామాలయం ఆధ్వర్యంలో కొత్తగా నిర్మిస్తున్న వసతి భవనాల్లో టైల్స్ పనికి వచ్చినట్టు చెబుతున్నారు. కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 10, 2026
నేటి నుంచి పశువులకు గాలికుంటు టీకాలు

ఖమ్మం జిల్లావ్యాప్తంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి పురందర్ తెలిపారు. మంగళవారం నుంచి ఏప్రిల్ 9 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. పశువైద్య బృందాలు గ్రామాలను సందర్శించి మూడు నెలలు దాటిన గేదె, గోజాతి పశువులకు టీకాలు వేస్తాయని వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పశువులను రక్షించుకోవాలని ఆయన కోరారు.
News March 10, 2026
నిర్వాసితులకు అండగా ఉంటాం: మంత్రి పొంగులేటి

ఖమ్మం వెలుగుమట్ల ఇళ్ల నిర్వాసితులందరికీ ప్రభుత్వం తరపున పూర్తి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. వారికి ఇంటి పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. క్రషర్ వివాదంపై వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అసత్య ప్రచారాలు చేసే వారికి అసెంబ్లీ సాక్షిగా గట్టి సమాధానం చెబుతానని మంత్రి హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
News March 9, 2026
రుణ లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ప్రాధాన్యత రంగ రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు సకాలంలో చేరుకోవాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో నిర్వహించిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, విద్య, గృహ నిర్మాణంతో పాటు ఎంఎస్‌ఎంఈ రంగాలకు రుణాల పంపిణీపై సమీక్షించారు. యువతకు స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పించి ఆర్థిక చేయూత అందించాలని సూచించారు.


