News April 5, 2025
జగిత్యాల: జిల్లాలో 25 బార్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల జిల్లాలో రెన్యూవల్ కానీ 25 బార్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయటానికి ఆసక్తి గల వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 26 వరకు కరీంనగర్ జిల్లా ఎక్సైజ్, రాష్ట్ర ఎక్సైజ్ కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చని అన్నారు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు
Similar News
News November 6, 2025
ములుగు జిల్లాలో 184 కొనుగోలు కేంద్రాలు

ములుగు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు 184 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. మహిళా సంఘాలు 59, ప్రాథమిక సహకార సంఘాలు 99, రైతు ఉత్పాదక సంస్థ 8, గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో 18 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోలు చేసి, మద్దతు ధర అందించనున్నట్లు తెలిపారు.
News November 6, 2025
ధాన్యం అమ్మిన రోజే అకౌంట్లలో డబ్బులు జమ

AP: ధాన్యం అమ్మిన రైతులకు అదేరోజు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసేలా ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీని కోసం 35 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. రోజూ నాలుగుసార్లు.. అంటే మధ్యాహ్నం 12 గంటలకు, 2 గంటలకు, సాయంత్రం 4, 7 గంటలకు రైతుల ఖాతాల్లో డబ్బులు పంపించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సెలవు రోజుల్లో పేమెంట్ గేట్‌వే పనిచేయదు కనుక, ఆ డబ్బులు మరుసటి రోజు జమ అవుతాయన్నారు.
News November 6, 2025
పెద్దపల్లి: ‘నవంబర్ 20లోగా దరఖాస్తులు చేసుకోవాలి’

పెద్దపల్లి జిల్లాలో విశిష్ట ప్రతిభ కనబరిచిన దివ్యాంగులు, దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు రాష్ట్రీయ దివ్యాంగుల సాధికారత అవార్డు-2025 కోసం ఈనెల 20లోగా wdsc.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేయాలని పెద్దపల్లి జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు సూచించారు. ఎంపికైన వారికి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం-2025 సందర్భంగా అవార్డులు అందజేయనున్నారు. వివరాలకు 9440852495కు కాల్ చేయాలి.


