News April 5, 2025

హార్ట్ బ్రేక్.. హార్దిక్ పాండ్య ఎమోషనల్

image

LSGతో జరిగిన మ్యాచ్‌లో ఓడిన తర్వాత MI కెప్టెన్ హార్దిక్ పాండ్య ఎమోషనల్ అయ్యారు. బౌలింగ్‌లో 5 వికెట్లు తీసినా, ఛేజింగ్‌లో చివరి వరకు పోరాడినా జట్టుకు విజయం దక్కలేదు. దీంతో ఆయన నిరాశకు లోనై బాధపడగా ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది. తిలక్ వర్మ బెటర్‌గా ఆడి ఉంటే మ్యాచ్ గెలిచేదని పోస్టులు పెడుతున్నారు. గతంతో పోలిస్తే గెలవాలనే కసి MIలో ఎందుకనో కనిపించట్లేదని క్రీడావిశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీ COMMENT.

Similar News

News April 6, 2025

ధోనీ వేగంగా ఆడేందుకే చూశారు.. కానీ: కోచ్ ఫ్లెమింగ్

image

నిన్న రాత్రి CSKvsDC మ్యాచ్‌లో ధోనీ 26 బంతులాడి 30 పరుగులే చేయడంతో జట్టు గెలవాలన్న కసి లేకుండా ఆడారంటూ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. వాటి గురించి ఆ టీమ్ కోచ్ ఫ్లెమింగ్ స్పందించారు. ‘గెలవాలన్న కసితోనే ధోనీ ఆడారు. కానీ మా బ్యాటింగ్ సమయానికి పిచ్‌ బాగా నెమ్మదించింది. ఆ ఆట చూడటానికి కష్టంగానే అనిపిస్తుంది కానీ అక్కడ ఆడేవారికి పిచ్ మరింత కష్టంగా ఉంది’ అని పేర్కొన్నారు.

News April 6, 2025

జుట్టు రాలుతోందా.. ఇలా చేస్తే మేలు!

image

జుట్టు రాలడమనే సమస్యను నేటి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నారు. శిరోజాలపై సరైన శ్రద్ధ తీసుకోకపోవడం దీనికి ప్రధాన కారణమని హెయిర్‌కేర్ నిపుణులు చెబుతున్నారు. కుదుళ్లకు క్రమం తప్పకుండా నూనె(ఆముదం, కొబ్బరి, బాదం) పట్టించి మర్దనా చేయడం వల్ల వెంట్రుకలకు బలం అందుతుంది. ప్రొటీన్లు, ఐరన్ వంటివి పుష్కలంగా ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలి. 2 రోజులకోసారైనా తలస్నానం చేయాలని వారు పేర్కొంటున్నారు.

News April 6, 2025

సుంకాలు తగ్గించేందుకు చైనాకు ట్రంప్ ఆఫర్

image

సుంకాల విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ చైనాకు ఓ ఆఫరిచ్చారు. బీజింగ్‌పై విధించిన సుంకాల్ని తగ్గించాలంటే చైనా అధీనంలోని టిక్‌టాక్‌ను అమెరికా సంస్థకు అమ్మేయాలని డిమాండ్ చేశారు. బైడెన్ సర్కారు ఆ సంస్థపై విధించిన నిషేధాన్ని ట్రంప్ ఎత్తేసి, బ్యాన్‌ను 75 రోజులపాటు వాయిదా వేయడం గమనార్హం. టిక్‌టాక్ అమెరికన్ల సమాచారాన్ని దొంగిలించి చైనాకు ఇస్తోందని ట్రంప్ చాలాకాలంగా ఆరోపిస్తున్నారు.

error: Content is protected !!