News April 5, 2025
పార్వతీపురం: సెకండ్ గ్రేడ్ టీచర్ పరీక్షకు ఉచిత శిక్షణ

జిల్లాలో వెనుకబడిన తరగతులు, ఆర్థిక, బలహీన వర్గాల అభ్యర్థుల నుంచి సెకండ్ గ్రేడ్ టీచర్ పరీక్షకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి అప్పన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఎస్సీ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణా తరగతులను నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 6, 2025
వనపర్తిలో శవం కలకలం..!

డ్రైనేజ్ కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వనపర్తి 20వ వార్డుకు చెందిన కార్ డ్రైవర్ శ్రీను(46) శనివారం సాయంత్రం రామా టాకీస్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ కాలువలో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 6, 2025
‘HHVM’కి 5 రోజులు కేటాయించిన పవన్?

హరిహర వీరమల్లు సినిమాలో తనకు సంబంధించిన పెండింగ్ సీన్లను పవన్ కళ్యాణ్ వచ్చే వారం కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షూటింగ్‌కు 5 రోజుల్ని కేటాయించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న ఆయన, అభిమానుల కోరిక మేరకు పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. HHVMతో పాటు OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉంది.
News April 6, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నుంచి నెల రోజుల పాటు 30 సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, ఉరేగింపులు నిర్వహించడం నిషేధించినట్లు చెప్పారు. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా డీజే సౌండ్‌లను వినియోగించడంపై నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.