News March 26, 2024
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ తుషార్

ఎన్నికలవేళ సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారని, గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఓటర్ కార్డ్ ఆన్లైన్‌లో నమోదు కాలేదని, ఎన్నికల సర్వేలో పాల్గొంటే బహుమతులని ఫోన్‌కు లింకులు పంపిస్తున్నారు. ఇలాంటి సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుషార్ డూడీ సూచించారు.
Similar News
News March 14, 2026
రాజధాని అమరావతి రైతులకు APCRDA విజ్ఞప్తి

అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే “గ్రీవెన్స్ డే” కార్యక్రమం మార్చి 14న తాత్కాలికంగా రద్దు చేశారు. రెండవ శనివారం కావడంతో నిర్వహణ కారణాల రీత్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రాజధాని ప్రాంత రైతులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News March 14, 2026
గుంటూరులో బ్లింకిట్ పేరుతో సైబర్ మోసం

గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణనగర్ నాలుగో లైన్‌కు చెందిన పగడాల ప్రసాద్‌ను సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. బ్లింకిట్ యాప్ ఆర్డర్ రిటర్న్ పేరుతో గూగుల్‌లో కనిపించిన నంబర్‌కు కాల్ చేయగా యూపీఐకు డబ్బు పంపితే రిఫండ్ వస్తుందని చెప్పి రూ.84 వేలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 14, 2026
మంగళగిరిలో ఆహార భద్రత శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష

కుంచనపల్లిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఆహార భద్రత శాఖ పనితీరుపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఆహార భద్రత సూచీలో దేశంలో తొలి 10 స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా పెట్టాలని అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేయాలన్నారు. బాగా పనిచేసేవారిని ప్రోత్సహించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేవారిపై చర్యలు ఉంటాయన్నారు.


