News April 5, 2025

తిలక్ రిటైర్డ్ హర్ట్: ముంబైపై తీవ్ర విమర్శలు

image

తిలక్ వర్మను రిటైర్డ్ హర్ట్‌గా మ్యాచ్ మధ్యలోనే బయటకు పంపడంపై మాజీలు, క్రికెట్ ఫ్యాన్స్ ముంబై యాజమాన్యంపై మండిపడుతున్నారు. ఇది అతడిని అవమానించడమేనని ఫైర్ అవుతున్నారు. తిలక్ స్థానంలో వచ్చిన శాంట్నర్ ఎన్ని సిక్సులు కొట్టాడని ప్రశ్నిస్తున్నారు. శాంట్నర్‌కు హార్దిక్ చివరి ఓవర్లో ఎందుకు స్ట్రైక్ ఇవ్వలేదని నిలదీస్తున్నారు. GTపై ఫెయిలైన పాండ్యను ఎందుకు రిటైర్డ్ హర్ట్‌గా పంపలేదని దుమ్మెత్తిపోస్తున్నారు.

Similar News

News April 6, 2025

జుట్టు రాలుతోందా.. ఇలా చేస్తే మేలు!

image

జుట్టు రాలడమనే సమస్యను నేటి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నారు. శిరోజాలపై సరైన శ్రద్ధ తీసుకోకపోవడం దీనికి ప్రధాన కారణమని హెయిర్‌కేర్ నిపుణులు చెబుతున్నారు. కుదుళ్లకు క్రమం తప్పకుండా నూనె(ఆముదం, కొబ్బరి, బాదం) పట్టించి మర్దనా చేయడం వల్ల వెంట్రుకలకు బలం అందుతుంది. ప్రొటీన్లు, ఐరన్ వంటివి పుష్కలంగా ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలి. 2 రోజులకోసారైనా తలస్నానం చేయాలని వారు పేర్కొంటున్నారు.

News April 6, 2025

సుంకాలు తగ్గించేందుకు చైనాకు ట్రంప్ ఆఫర్

image

సుంకాల విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ చైనాకు ఓ ఆఫరిచ్చారు. బీజింగ్‌పై విధించిన సుంకాల్ని తగ్గించాలంటే చైనా అధీనంలోని టిక్‌టాక్‌ను అమెరికా సంస్థకు అమ్మేయాలని డిమాండ్ చేశారు. బైడెన్ సర్కారు ఆ సంస్థపై విధించిన నిషేధాన్ని ట్రంప్ ఎత్తేసి, బ్యాన్‌ను 75 రోజులపాటు వాయిదా వేయడం గమనార్హం. టిక్‌టాక్ అమెరికన్ల సమాచారాన్ని దొంగిలించి చైనాకు ఇస్తోందని ట్రంప్ చాలాకాలంగా ఆరోపిస్తున్నారు.

News April 6, 2025

జాగ్వార్ ఎగుమతుల నిలిపివేత

image

టాటాకు చెందిన ‘జాగ్వార్ ల్యాండ్‌రోవర్’ (JLR) సంస్థ తమ లగ్జరీ కార్లను బ్రిటన్‌లో ఉత్పత్తి చేస్తుంటుంది. బ్రిటన్‌ ఉత్పత్తులపై ట్రంప్ 25శాతం సుంకాన్ని విధించిన నేపథ్యంలో USకు కార్ల ఎగుమతిని నిలిపేయాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ది టైమ్స్’ కథనం ప్రకారం.. నెల రోజుల పాటు తమ నిర్ణయాన్ని అమలుచేయాలని JLR యోచిస్తోంది. 2 నెలలకు సరిపడా ఎగుమతుల్ని ఇప్పటికే USకు పంపించినట్లు సమాచారం.

error: Content is protected !!