News April 5, 2025

SR పురం : తండ్రిని హత్య చేసిన కుమారుడు అరెస్ట్

image

SRపురం మండలం పాపిరెడ్డిపల్లెలో శ్రీనివాసులు (60)ను కొడుకు నాగరాజు బుధవారం హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తండ్రి తరచూ మద్యం తాగి వచ్చి తల్లిని కొట్టేవాడు. అది సహించలేక నాగరాజు తండ్రి తలపై ఇటుకతో కొట్టాడు. తీవ్రంగా గాయపడి శ్రీనివాసులు మృతిచెందగా..మృతుని అన్న ఫిర్యాదుతో కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్సై సుమన్ నాగరాజుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News April 5, 2025

శ్రీరామనవమి వేడుకలు.. చిత్తూరు SP సూచనలు 

image

చిత్తూరు జిల్లా ప్రజలకు SP మణికంఠ చందోలు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమిని చైత్రశుద్ధ నవమి రోజున ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. శ్రీరాముడు ధర్మానికి, న్యాయానికి ప్రతీక అని ఈ పండుగ మనకు ధర్మాన్ని ఆచరించాలనే సందేశం ఇస్తుందని SP అన్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు వేడుకలు చేసుకోవాలని ఆయన సూచించారు. 

News April 5, 2025

గ్రూప్ -2 కు ఎంపికైన చౌడేపల్లి కానిస్టేబుల్

image

గ్రూప్-2 పరీక్షలలో చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆదినారాయణ ఎంపికయ్యారు. విధి నిర్వహణలో చురుగ్గా పాల్గొంటూ.. అటు గ్రూప్‌-2లో ప్రతిభ చూపాడు. ఆయనను సీఐ రాంభూపాల్, ఎస్సై నాగేశ్వరరావుతో పాటు సహచర సిబ్బంది అభినందించారు. 

News April 5, 2025

హుబ్లీ రైల్వే డివిజన్ సభ్యునిగా ఎమ్మెల్సీ భరత్

image

హుబ్లీ రైల్వే డివిజన్ వినియోగదారుల సలహా కమిటీ సభ్యుడిగా చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ నియమితులయ్యారు. రాష్ట్ర శాసనసభ జనరల్ సెక్రటరీ సిఫార్సు మేరకు ఈ నియామకం చేసినట్లు నైరుతి రైల్వే డివిజనల్ మేనేజర్ అరవింద హెర్లె శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

error: Content is protected !!