News April 5, 2025
ట్రంప్ వచ్చినప్పటి నుంచి 10 ట్రిలియన్ డాలర్ల నష్టం!

ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికా స్టాక్ మార్కెట్లకు దాదాపు 10 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు పలు సంస్థలు వెల్లడించాయి. అందులో 5 ట్రిలియన్ డాలర్ల సంపద కేవలం రెండు రోజుల్లోనే ఆవిరైందని తెలిపాయి. ట్రంప్ టారిఫ్స్ పాలసీ వల్ల అమెరికాకు ఆర్థికమాంద్యం ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు US దిగుమతులపై చైనా 34% సుంకం విధించడం వాణిజ్య యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది.
Similar News
News September 12, 2025
రేపు గ్రూప్-2 మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్

TG: 783 గ్రూప్-2 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మూడో విడత తేదీలను TGPSC ప్రకటించింది. రేపు ఉదయం 10.30 గంటల నుంచి HYD నాంపల్లిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో ప్రారంభమవుతుందని తెలిపింది. అభ్యర్థులు హాజరయ్యాక ఇంకా ఏవైనా పత్రాలు పెండింగ్‌లో ఉంటే ఈనెల 15న సమర్పించొచ్చని పేర్కొంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.inలో చూడొచ్చు.
News September 12, 2025
అవినీతిని అడ్డుకునేందుకు AI మినిస్టర్.. ఎక్కడో తెలుసా?

ప్రపంచంలోనే ఏఐ ఆధారంగా పనిచేసే మంత్రిని అల్బేనియా దేశం నియమించింది. ఈ ఏఐ మహిళా మంత్రికి ‘డియెల్లా’ అని పేరు పెట్టింది. ఈమె అన్ని ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించిన బాధ్యతలను పర్యవేక్షిస్తారు. దీనిద్వారా అల్బేనియా ప్రభుత్వం అవినీతిని తగ్గించొచ్చని భావిస్తోంది. అల్బేనియాలో ప్రభుత్వ టెండర్లు & ప్రజా నిధుల కేటాయింపుల్లో భారీగా అవినీతి జరుగుతుందనే ఆరోపణలున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.
News September 12, 2025
PHOTOS: వే2న్యూస్ కాన్‌క్లేవ్-2025

AP: నేడు మంగళగిరిలో నిర్వహించిన Way2News కాన్‌క్లేవ్-2025 విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు.. రాజధాని అమరావతి, పోలవరం, పెట్టుబడులు, మెడికల్ కాలేజీలు ఇలా అనేక అంశాలపై తన విజన్‌ను వివరించారు. అటు వైసీపీ నుంచి సజ్జల, బుగ్గన తమ పాలనలో చేసిన పనులు, ఆలోచనలను పంచుకున్నారు. ఈ ప్రోగ్రామ్ ఫొటోస్‌ను పై గ్యాలరీలో చూడొచ్చు.