News April 5, 2025
పల్నాడు: హత్య కేసులో UPDATE

పల్నాడు జిల్లాలో మూడ్రోజుల క్రితం జరిగిన హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. మాచర్ల (మం) పశువేములకు చెందిన హరిశ్చంద్ర, అతని అల్లుడు బ్రహ్మంకు మధ్య గొడవలు జరిగ్గా హరిశ్చంద్ర గొడ్డలితో దాడి చేశాడు. బ్రహ్మం సోదరుడు రమేశ్‌కు తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లాడు. ప్రస్తుతం అతను గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో హరిశ్చంద్రను కిడ్నాప్ చేసి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నామన్నారు.
Similar News
News April 6, 2025
RGM: ‘ఈ ఏడాది నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి సాధించాలి’

ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి- ఉత్పాదకత, ఓబి రిమూవింగ్, రవాణా నిర్విరామంగా కొనసాగాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. రామగుండం సింగరేణి GM ఆసిఫ్ అలీ అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రక్షణతో కూడిన ఉత్పత్తి చేయాలన్నారు. అధికారులు గోపాల్ సింగ్, చంద్రశేఖర్, వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, శివ నారాయణ, చిలుక శ్రీనివాస్, రమేశ్ ఉన్నారు.
News April 6, 2025
ALERT: రేపు, ఎల్లుండి వర్షాలు

TG: ద్రోణి కారణంగా వచ్చే 2రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో రేపు.. వీటితో పాటు సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.
News April 6, 2025
ముస్లింలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది: ఎమ్మెల్సీ కవిత

TG: వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కారణంగానే బీజేపీ సర్కారు బిల్లును ఆమోదింపజేసుకుంది. ముస్లింలకు తీవ్ర నష్టం చేకూర్చే ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి. మైనారిటీల తరఫున మా పార్టీ పోరాడుతుంది. గతంలోనూ వారి అభివృద్ధి, సంక్షేమానికి మేం కృషి చేశాం’ అని గుర్తుచేశారు.