News April 5, 2025
బాక్సాఫీస్ ‘WAR’.. రజినీVSహృతిక్-ఎన్టీఆర్

రజినీకాంత్ ‘కూలీ’, హృతిక్-NTR నటిస్తున్న ‘వార్-2’ ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానున్నాయి. దీంతో సౌత్‌లో ఏ సినిమా డామినేట్ చేస్తుందనే చర్చ మొదలైంది. ‘వార్-2’ కంటే ‘కూలీ’కే ఆడియన్స్ మొగ్గు చూపొచ్చన్నది నెటిజన్ల అభిప్రాయం. రజినీ, నాగార్జునతో పాటు లోకేశ్ కనగరాజ్ ఆ సినిమాకు బలమని.. ‘వార్-2’ను హిందీ డైరెక్టర్ తెరకెక్కించడం, అది NTR సోలో ఫిల్మ్ కాకపోవడంతో కాస్త డిమాండ్ తక్కువ ఉండొచ్చని అంటున్నారు.
Similar News
News April 10, 2025
3 రోజులకు రూ.25 కోట్లు.. నో చెప్పిన ప్రభాస్!

పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ ఉన్నా ప్రభాస్ యాడ్స్‌లో కనిపించేది చాలా తక్కువే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బాహుబలికి ఓ బ్రాండ్ యాడ్‌లో నటించాలని ఆఫర్ వచ్చిందట. 3 రోజులు కేటాయిస్తే రూ.25 కోట్లు ఇస్తామని ఆఫర్ చేయగా ప్రభాస్ సింపుల్‌గా నో చెప్పారని సమాచారం. ప్రస్తుతం ఫౌజీ, ది రాజాసాబ్ చిత్రాలతో డార్లింగ్ తీరిక లేకుండా ఉన్నారు. ఆ తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 చిత్రాల్లో నటించాల్సి ఉంది.
News April 10, 2025
మూడు దశాబ్దాల కల సాకారం కానుంది: మంత్రి లోకేశ్

AP: మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల సాకారం కానుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. చినకాకాని వద్ద వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఈ నెల 13న శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అత్యాధునిక వసతులతో దేశానికే రోల్ మోడల్‌గా, కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా నిర్మించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఏడాదిలోగా ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని పేర్కొన్నారు.
News April 10, 2025
FIRST PHOTO: కస్టడీలో తహవూర్ రాణా

ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రాణాను ఇండియాకు తీసుకొచ్చిన అనంతరం ఫస్ట్ ఫొటో బయటకు వచ్చింది. అయితే అందులో రాణా ముఖం కనిపించట్లేదు. NIA అధికారులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. కాసేపటి క్రితం అమెరికా నుంచి రాణాను తీసుకొచ్చిన ఎయిర్‌ఫోర్స్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.