News April 5, 2025

MBNR: ప్రేమించాడని యువకుడిపై దాడి

image

నవాబుపేట మండలంలో యువతిని ప్రేమించాడని యువకుడిపై దాడి జరిగిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. పల్లెగడ్డకు చెందిన అరవింద్ పాత పాలమూర్‌కు చెందిన యువతిని ప్రేమించాడు. విషయం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారు అరవింద్‌ను మాట్లాడుదామని గ్రామం బయటికి తీసుకెళ్లి దాడి చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News September 11, 2025

గ్రామాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ చేయండి: చిన్నారెడ్డి

image

గ్రామాల్లో జరుగుతున్న, జరగబోయే అభివృద్ధి పనులకు సంబంధించి మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని అధికారులకు రాష్ట్ర ఆర్థిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి సూచించారు. బుధవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్ సమావేశపు హాలులో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పురాతనమైందని, గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నేరుగా నిధులు వచ్చేలా అప్పట్లో రాజీవ్ గాంధీ రూపొందించారని గుర్తు చేశారు.

News September 10, 2025

రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌కు ఘన స్వాగతం

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఆదాయ వనరుల పెంపుపై సమీక్షించేందుకు జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకిలు మొక్కలను అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.

News September 9, 2025

MBNR: ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌.. CONGRATS తెలిపిన డీకే అరుణ

image

భారత ఉపరాష్ట్రతిగా NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌ ఎన్నికయ్యారు. దీంతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్‌డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ 452 ఓట్లతో విజయం సాధించారు. ఇవాళ ఉదయం డీకే అరుణ దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తన ఓటును సద్వినియోగం చేసుకున్నారు.