News April 5, 2025
కొమరోలు: భర్తపై యాసిడ్ పోసిన భార్య

గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు (మం) బాదినేనిపల్లెకి చెందిన ప్రసన్న, నాగార్జున ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ రాజంపేటలోని బోయినపల్లెలో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య గొడవల కారణంగా మార్చి 23వ తేదీన నాగార్జునకు ప్రసన్న మత్తు మందు ఇచ్చి అతనిపై యాసిడ్ పోసి పరారైంది. కుటుంబ సభ్యులు నాగార్జునను తిరుపతి, కడప, కర్నూల్ వైద్యశాలలో చికిత్స ఇప్పించారు. శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News December 26, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ బదిలీ..!

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎం.హరిత బదిలీ అయ్యారు. చాలారోజులుగా సెలవులో ఉన్న ఆమెను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దివారాలుగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా వ్యవహరిస్తున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్(పూర్తి అదనపు బాధ్యతలు)గా కొనసాగాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
News December 26, 2025
కాకా మెమోరియల్ క్రికెట్.. నేడు KNR vs SRCL FINAL MATCH

KNR జిల్లా తిమ్మాపూర్ మండలంలోని 8వ డివిజన్ అల్గునూర్లో HCA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకా వెంకట స్వామి మెమోరియల్ క్రికెట్లో భాగంగా కరీంనగర్ vs పెద్దపల్లి మధ్య జరిగిన మ్యాచ్లో కరీంనగర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని విజయం సాధించింది. ఇవాళ కరీంనగర్ vs రాజన్న సిరిసిల్ల జిల్లాల మధ్య ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
News December 26, 2025
ADB: వివాహితకు యువకుడి వేధింపులు.. SUICIDE

వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బోథ్లో చోటుచేసుకుంది. SI శ్రీ సాయి తెలిపిన వివరాలు.. మండలంలోని సాకెర గ్రామానికి చెందిన జాదవ్ స్రవంతి (30)ని అదే గ్రామానికి చెందిన జాదవ్ కృష్ణ రెండేళ్లుగా భర్తను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ మధ్య వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదైంది.


