News April 5, 2025

RGM: కానిస్టేబుల్ నుంచి పంచాయతీరాజ్ AE

image

రామగుండం NTPCపోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తూర్పాటి సాయిలత పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో AEగా ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా విధుల నుంచి రిలీవ్ అయి వెళ్తున్న సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో SIలు ఉదయ్ కిరణ్, మానస పోలీసు సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు. గతేడాది కానిస్టేబుల్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయిలత అనతి కాలంలో AEగా ఉద్యోగ సాధించడం పట్ల అభినందించారు.

Similar News

News February 28, 2026

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం.. భారతీయులకు అలర్ట్

image

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇజ్రాయెల్, ఇరాన్, UAE, జోర్డాన్, కువైట్, ఖతర్, బహ్రెయిన్ దేశాల్లోని భారతీయులకు కీలక సూచనలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి వెళ్లొద్దని చెప్పింది. ఎప్పటికప్పుడు వార్ న్యూస్ తెలుసుకుంటూ అవగాహనతో ఉండాలని తెలిపింది. అత్యవసర సహాయానికి తమ దేశంలోని ఎంబసీలను సంప్రదించాలని పేర్కొంది.

News February 28, 2026

పార్వతీపురం: మార్చి నెలలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు

image

మార్చి 14 నుంచి 29 వరకు వివిధ జిల్లాలో క్రీడా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి డా.కె.శ్రీధర్ రావు శనివారం తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే మహిళలు, పురుషులు పార్వతీపురం మన్యం జిల్లా వాసులలై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారుల వయస్సు, కేటగిరీ మేరకు సంబందిత ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉందన్నారు.

News February 28, 2026

BREAKING.. నస్రుల్లాబాద్: కాలేజ్ భవనంపై నుంచి దూకి ఉద్యోగి ఆత్మహత్య

image

నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని SRNK డిగ్రీ కళాశాలలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ అహమ్మద్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు కొంతకాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.