News April 5, 2025
బైక్‌పై దేశ పర్యటన.. మహానందిలో పూజలు

ప్రపంచ దేశాలలో భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవని విజయనగరం వెంకటరెడ్డి తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా తన వంతు మోటార్ సైకిల్‌పై 92 వేల కి.మీ దేశ పర్యటన చేస్తున్న ఆయన శుక్రవారం రాత్రి మహానందికి చేరుకున్నారు. మహానందీశ్వర స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 1000 రోజుల పర్యటనలో ఇప్పటికే 150 రోజులు పూర్తయ్యాయని తెలిపారు.
Similar News
News July 7, 2025
జులై 7ను జీవితంలో మరిచిపోలేను: రేవంత్ రెడ్డి

తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ‘నియంతృత్వాన్ని సవాల్ చేసి.. నిర్భందాన్ని ప్రశ్నించి, స్వేచ్ఛ కోసం యుద్ధం ప్రకటించిన సందర్భం అది. నేటి ప్రజా పాలనకు నాడు సంతకం చేసిన సంకల్పం. సోనియా గాంధీ ఆశీస్సులు, రాహుల్ గాంధీ అండతో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జులై 7ను జీవితంలో మరచిపోలేను’ అని ఆయన Xలో రాసుకొచ్చారు.
News July 7, 2025
HYD: జంట జలాశయాలలో నీరు పుష్కలం.!

HYD నగర శివారు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉందని జలమండలి తెలిపింది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1782.75 అడుగులు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.5 అడుగులు కాగా, ప్రస్తుతం 1758 అడుగులు ఉన్నట్లు తెలిపారు. గత రికార్డుతో పోలిస్తే ఈసారి నీరు అధికంగా ఉందన్నారు.