News April 5, 2025
జగ్గంపేట: 15 రోజుల్లో పెళ్లి.. అంతలోనే యువకుడి మృతి

జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన చిక్కాల శ్రీనుకు పెళ్లి కుదరడంతో షాపింగ్ నిమిత్తం పెద్దాపురం వెళ్లి తిరిగి వస్తుండగా లారీ మృత్యురూపంలో రావడంతో ప్రాణాలు విడిచాడు. దీంతో పెళ్ళంట తీవ్ర విషాదం నెలకొంది. అయితే శ్రీను పుట్టినరోజు శనివారమే కాగా గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News April 6, 2025
అధ్యక్ష బాధ్యతల వల్ల భార్యకు దూరమయ్యా: ఒబామా

ఒబామా అమెరికా అధ్యక్షుడిగా 8 ఏళ్ల పాటు సేవలందించారు. ఆ సమయంలో తన భార్య మిషెల్‌కు దూరమయ్యానని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘అధ్యక్ష బాధ్యతల కారణంగా మిషెల్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయాను. దీంతో మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకానొక సమయంలో మ్యారేజ్ కౌన్సిలర్‌ను కూడా కలిశాం. అధ్యక్షుడిగా దిగిపోయాక ఇప్పుడు ఆమెతోనే ఎక్కువ ఉంటున్నాను. మా బంధం మెరుగైంది’ అని వెల్లడించారు.
News April 6, 2025
నేడు భద్రాద్రికి సీఎం రేవంత్ రెడ్డి

CM రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన ఖరారైంది. నేడు ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో సారపాకలోని గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. 10:30కు భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారు. 11:10 నుంచి 12.30 వరకు మిథిలా స్టేడియంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. 12:35కు సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడి నివాసంలో భోజనం చేయనున్నారు. అనంతరం ఐటీసీ గెస్ట్ హౌస్ నుంచి HYDకు తిరుగుపయనమవుతారు.
News April 6, 2025
తెలంగాణ కొత్త సీఎస్ ఆయనేనా?

TG: సీఎస్ శాంతికుమారి ఈనెలాఖరున రిటైర్ కానున్న నేపథ్యంలో తదుపరి సీఎస్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఐఏఎస్ రామకృష్ణారావును సీఎస్‌గా నియమించాలని CM రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. ఆర్థిక శాఖలో సుదీర్ఘ అనుభవం, రాష్ట్ర పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండడంతో ఆయనవైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు శాంతికుమారి వీఆర్ఎస్ తీసుకుంటారని, ఆమెకు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.