News April 5, 2025
రజనీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం: అడ్వకేట్ జనరల్

స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి, డబ్బులు వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి రజనీ, ఆమె మరిది గోపికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశముందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదించారు. ACB వేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రజిని వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కేసులో రాజకీయ కారణాలు ఉన్నాయని రజనీ తరపున సీనియర్ న్యాయవాదులు శ్రీరామ్, మహేశ్వర రెడ్డి వాదించారు.
Similar News
News April 6, 2025
కరీంనగర్: లోయర్ మానేరు డ్యాం నీటి విడుదల నిలిపివేత

లోయర్ మానేరు డ్యామ్ నుంచి వచ్చే నీరును ఆదివారం నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాలువ ద్వారా యాసంగి సాగుకు నీటి విడుదల మార్చి 31 వరకు ఉండగా అదనంగా ఆరు రోజులు ఎక్కువ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం LMDలో 5.81టీఎంసీ నీరు మాత్రమే ఉందని, కరీంనగర్ నగరానికి కావలసిన తాగునీటికి ఇబ్బంది కాకుండా దిగువకు నీటి సరఫరాను నిలిపివేసినట్లు తెలిపారు.
News April 6, 2025
ALERT: మరో 5 రోజులు వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. నేడు ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, కాకినాడ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని APSDMA ఓ ప్రకటనలో అంచనా వేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది.
News April 6, 2025
KMR: నీళ్లు దుర్వినియోగం.. మూడు కేసులు

మిషన్ భగీరథ నీళ్లు అక్రమంగా దారి మళ్లించి దుర్వినియోగపరిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా SP రాజేష్ చంద్ర హెచ్చరించారు. జిల్లాలో మిషన్ భగీరథ నీళ్లని దారి మళ్లించి దుర్వినియోగం చేసిన ఇద్దరిపై లింగంపేట్ PSలో, పెద్ద కోడప్గల్ మండలం పోచారం తండాకు చెందిన మరో వ్యక్తి పై కేసు నమోదైనట్లు ఆయన శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.