News April 5, 2025

నేడు స్కూళ్లకు సెలవు

image

నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తెలంగాణలో పబ్లిక్ హాలిడే ఇచ్చారు. అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. బ్యాంకులు సైతం పని చేయవు. అటు ఏపీలో ఇవాళ పబ్లిక్ హాలిడే ప్రకటించకపోవడంతో విద్యాసంస్థలు యథావిధిగా నడవనున్నాయి. చిన్న వయసులోనే కులవివక్షను ఎదుర్కొన్న జగ్జీవన్ రామ్.. అణగారిన వర్గాల కోసం పోరాడారు. మన దేశంలో అత్యధిక కాలం (30 ఏళ్లు) కేంద్రమంత్రిగా పని చేసిన రికార్డు ఈయనదే.

Similar News

News April 6, 2025

నేడు వైన్ షాపులు బంద్

image

TG: శ్రీరామనవమి సందర్భంగా నేడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని వైన్ షాపులు మూతబడనున్నాయి. ఉ.10 నుంచి రాత్రి 10 వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు ఉత్తర్వులు జారీ చేశారు. కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ చేయాలని ఆదేశించారు. స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపునిచ్చారు. అటు జిల్లాల్లో వైన్ షాపులు తెరిచి ఉండనున్నాయి.

News April 6, 2025

ALERT: మరో 5 రోజులు వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. నేడు ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, కాకినాడ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని APSDMA ఓ ప్రకటనలో అంచనా వేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది.

News April 6, 2025

చరిత్ర సృష్టించిన శాంసన్

image

IPL: నిన్న పంజాబ్‌పై గెలుపుతో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించారు. షేన్ వార్న్‌ను వెనక్కినెట్టి RR మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచారు. మొత్తం 62 మ్యాచ్‌ల్లో 32 విజయాలు సాధించారు. 2021లో సారథ్య బాధ్యతలు తీసుకున్న సంజూ ఈ సీజన్ తొలి మూడు మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేయలేదు. మరోవైపు ఐపీఎల్ తొలి సీజన్‌లోనే RRకు ట్రోఫీ అందించిన వార్న్ 55 మ్యాచ్‌ల్లో 31 విక్టరీలతో రెండో స్థానంలో ఉన్నారు.

error: Content is protected !!