News April 5, 2025
వజ్రపుకొత్తూరు: బాతుపురంలో నెమళ్ల సందడి

వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామంలో శుక్రవారం నెమళ్లు సందడి చేశాయి. గ్రామం సమీపంలోని కొండల ప్రాంతం నుంచి నెమళ్లు గ్రామానికి చేరుకుని గ్రామంలోని చెట్లపై కనిపిస్తూ కనువిందు చేశాయి. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన నెమళ్లు జనావాసాల్లోకి వస్తుండటంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా నెమళ్లు రాక గ్రామస్థులకు ఆహ్లాదాన్ని ఇచ్చింది.
Similar News
News April 13, 2025
మందస : పరీక్ష రోజు తండ్రి మృతి.. 483 మార్కులతో సత్తా

తన తండ్రి మరణాన్ని దిగమింగుకుని పరీక్ష రాసిన విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ సీఈసీలో 483/500 మార్కులు సాధించింది. మందస గ్రామానికి చెందిన శివాని తండ్రి పండా పరీక్ష రోజు గుండెపోటుతో మరణించారు. పుట్టెడు దు:ఖంలోనూ పరీక్షలు రాసింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకబడకుండా పరీక్షలలో సత్తా చాటడంతో అధ్యాపకులు,కుటుంబీకులు అభినందనలు తెలిపారు.
News April 13, 2025
శ్రీకాకుళం జిల్లాలో చికెన్ ధరలు ఎంతంటే

శ్రీకాకుళంలో చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం బాయిలర్ లైవ్ రూ.150, డ్రెస్డ్ రూ. 255, స్కిన్ లెస్ రూ. 275 ధరలు ( కేజీల్లో) ఉన్నాయి. ఇటీవల బర్డ్ ఫ్లూ కారణంగా విపరీతంగా తగ్గిన ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇప్పటికే చికెన్ ప్రియులు షాపుల వద్ద బారులు తీరారు. ఆదివారం కావడంతో జిల్లాలో ముమ్మరంగా చికెన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో కూడా స్వస్ప వ్యత్యాసంతో ఇదే ధరలు ఉన్నాయి.
News April 13, 2025
శ్రీకాకుళం: రెండు నెలలు చేపల వేట బంద్

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రెండు నెలల పాటు చేపల వేట నిషేంధించినట్లు శ్రీకాకుళం మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ శనివారం తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదన్నారు. మత్స్య సంపద పరిరక్షణ, పునరుత్పత్తి, నిర్వహణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.