News April 5, 2025
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 12గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 15 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 66,327 మంది దర్శించుకోగా, 26,354 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
Similar News
News April 6, 2025
నేడు వైన్ షాపులు బంద్

TG: శ్రీరామనవమి సందర్భంగా నేడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని వైన్ షాపులు మూతబడనున్నాయి. ఉ.10 నుంచి రాత్రి 10 వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు ఉత్తర్వులు జారీ చేశారు. కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ చేయాలని ఆదేశించారు. స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపునిచ్చారు. అటు జిల్లాల్లో వైన్ షాపులు తెరిచి ఉండనున్నాయి.
News April 6, 2025
ALERT: మరో 5 రోజులు వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. నేడు ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, కాకినాడ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని APSDMA ఓ ప్రకటనలో అంచనా వేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది.
News April 6, 2025
చరిత్ర సృష్టించిన శాంసన్

IPL: నిన్న పంజాబ్‌పై గెలుపుతో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించారు. షేన్ వార్న్‌ను వెనక్కినెట్టి RR మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచారు. మొత్తం 62 మ్యాచ్‌ల్లో 32 విజయాలు సాధించారు. 2021లో సారథ్య బాధ్యతలు తీసుకున్న సంజూ ఈ సీజన్ తొలి మూడు మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేయలేదు. మరోవైపు ఐపీఎల్ తొలి సీజన్‌లోనే RRకు ట్రోఫీ అందించిన వార్న్ 55 మ్యాచ్‌ల్లో 31 విక్టరీలతో రెండో స్థానంలో ఉన్నారు.