News April 5, 2025

పవర్ ప్లేలో అత్యధిక బంతులు ఎదుర్కొన్నది ఇతడే..

image

IPLలో LSG స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ చరిత్ర సృష్టించారు. పవర్ ప్లేలో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆటగాడిగా మార్ష్ నిలిచారు. MIతో మ్యాచులో ఆయన పవర్ ప్లేలో 30 బంతులు ఎదుర్కొని 60 పరుగులు చేశారు. ఈ క్రమంలో శిఖర్ ధవన్ (29 బంతుల్లో 42) రికార్డును ఆయన అధిగమించారు. ఆ తర్వాత గంగూలీ (28 బంతుల్లో 32) జయసూర్య (28 బంతుల్లో 59), లంబ్ (28 బంతుల్లో 50), సాల్ట్ (28 బంతుల్లో 60) వార్నర్ (28 బంతుల్లో 36) ఉన్నారు.

Similar News

News April 6, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల చికెన్ ధరలు తగ్గాయి. హైదరాబాద్ నగరంలో గత వారం స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.280 ఉండగా నేడు రూ.230గా ఉంది. విజయవాడలో కేజీ రూ.310 నుంచి రూ.270కి తగ్గింది. బర్డ్ ఫ్లూతో ఏపీలో ఓ చిన్నారి మృతి చెందిందన్న వార్తల ప్రభావం ధరలపై చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా చాలా మంది నాన్-వెజ్ తినేందుకు ఇష్టపడట్లేదు.

News April 6, 2025

కాంగ్రెస్ ఉదారత వల్లే ఈ పరిస్థితి: కంగనా రనౌత్

image

వక్ఫ్ బోర్డుల్లో నిబంధనల ఉల్లంఘనకు కాంగ్రెస్ ఉదారతే కారణమని నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విమర్శించారు. భారీ స్థాయిలో జరిగిన భూకబ్జాలకు వక్ఫ్ సవరణ బిల్లు పరిష్కారం చూపుతుందన్నారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచే వక్ఫ్ బోర్డుల ఏర్పాటులో భారీ కుట్ర ఉందని ఆరోపించారు. దాంతో ఇప్పటికీ దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ఏ ఒక్క వ్యక్తి, కమ్యూనిటీ లేదా సంస్థ చట్టం కంటే ఎక్కువ కాదని పేర్కొన్నారు.

News April 6, 2025

చెన్నై చెత్త రికార్డు

image

IPL: చెన్నై చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ సీజన్లో 5 నెమ్మదైన హాఫ్ సెంచరీల్లో 3 CSK ఆటగాళ్లవే కావడం గమనార్హం. విజయ్ శంకర్ 43, రచిన్ 42, జైస్వాల్ 40, లివింగ్‌స్టోన్ 39, గైక్వాడ్ 37 బంతుల్లో అర్ధసెంచరీలు చేశారు. అటు నిన్న ధోనీ క్రీజులోకి వచ్చిన 19 బంతుల తర్వాత బౌండరీ బాదారు. మ్యాచులు ఓడిపోవడం సహజం అని, అయితే చెన్నై బ్యాటర్లలో గెలవాలన్న కసి కనిపించట్లేదని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!