News April 5, 2025
HYD: ఈ బాధ్యతలు జోనల్ కమిషనర్లకు అప్పగింత

HYDలో కల్తీ ఆహారం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో తనిఖీల్లో ఉల్లంఘనలు గుర్తిస్తే లైసెన్సులు రద్దు చేయడం తదితర అధికారాలు GHMC జోనల్ కమిషనర్లకు అప్పగిస్తూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులకు ఉన్న ఈ విధుల్ని GHMC జోనల్ కమిషనర్లకు అప్పగించారు. GHMC పరిధిలోని 30 సర్కిళ్లకు సంబంధించిన అధికారులను ఐదుగురు జోనల్ కమిషనర్లకు అప్పగించారు.
Similar News
News April 6, 2025
HYD: ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణ కోసం వాట్సప్ గ్రూప్

ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణకు ఆర్పీఎఫ్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఏ రైలులో ఎవరు డ్యూటీలో ఉన్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మహిళా కోచ్‌లలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారనే విషయంపై దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.
News April 6, 2025
సికింద్రాబాద్: రైలులోని వాష్‌రూమ్‌లో అత్యాచారం (UPDATE)

రక్సెల్-సికింద్రాబాద్ రైలులోని వాష్‌రూమ్‌లో బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడి ఫొటోలు బయటకొచ్చాయి. HYDను చూడడానికి ఫ్యామిలీతో కలిసి వస్తున్న బాలికపై బేగంపేటలో ఉండే <<15997705>>సంతోష్(బిహార్ వాసి)<<>> అత్యాచారం చేస్తూ వీడియో తీశాడు. ఈ ఫిర్యాదుతో పోక్సో కేసు కింద అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై పూర్తి నివేదిక పంపాలని తాజాగా DGP, RPF డీజీని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కార్ కోరారు.
News April 6, 2025
HYD: చికెన్ దుకాణాలు ఖాళీ

మాంసం ప్రియులకు సండే పండగే. ఉదయం చికెన్, మటన్ షాపుల వద్ద క్యూలైన్లు, కిటకిటలాడే గిరాకీ షరామామూలే. కానీ, ఈ ఆదివారం శ్రీ రామ నవమి కావడంతో దృశ్యం పూర్తిగా మారిపోయింది. ప్రతాపసింగారం సహా HYDలోని అనేక మాంసం దుకాణాలు వెలవెలబోయాయి. ఎప్పుడూ జనసంద్రంగా మారే మార్కెట్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఇదే సీన్ గత వారం ఉగాది రోజూ కనిపించింది. పండుగల దెబ్బకు అమ్మకాలు పూర్తిగా తగ్గాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.