News April 5, 2025

గంజాయిని, మాదకద్రవ్యాలను రూపుమాపాలి: ADB SP

image

జిల్లా వ్యాప్తంగా గంజాయిని, మాదకద్రవ్యాలను రూపుమాపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. దాబాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదన్నారు. శుక్రవారం ADBలోని AR హెడ్ క్వార్టర్స్‌లో ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీసు సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు. ఏఎస్పీ కాజల్ సింగ్ తదితరులున్నారు.

Similar News

News April 6, 2025

టాప్‌ 10లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే

image

తెలంగాణ రాష్ట్రంలో పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో టాప్ టెన్ ఎమ్మెల్యేల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చోటు సంపాదించుకున్నారు. పీపుల్స్ పల్స్ సంస్థ సౌత్ ఫస్ట్ వెబ్ ద్వారా 2024 మార్చి 28 నుంచి ఏప్రిల్ 3 వరకు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేశారు. ఇందులో ఆదిలాబాద్ ఎమ్మెల్యే 8వ స్థానంలో నిలిచారు. నియోజకవర్గంలో 450 నుంచి 500 శాంపిల్స్ సేకరించినట్టు సంస్థ తెలిపింది.

News April 6, 2025

ADB: పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు POLYCET

image

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు పాలిసెట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బండి రాంబాబు తెలిపారు. ఏప్రిల్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, మే 13న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పదోతరగతి పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 6, 2025

శిక్షలు పడేవిధంగా ప్రతి ఒక్కరు పని చేయాలి: ADB ఎస్పీ

image

కోర్టులలో నేరస్తులకు సరైన సమయంలో సరైన శిక్ష పడేవిధంగా ప్రతి ఒక్క కోర్టు డ్యూటీ అధికారి పని చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్ పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో కోర్టు డ్యూటీ అధికారులు, లైసెన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎఫ్ఐఆర్ నమోదైన సందర్భం నుంచి కేసు పూర్తి అయ్యేవరకు ప్రతి ఒక్క అంశాన్ని కోర్టు డ్యూటీ అధికారులు పరిశీలించాలన్నారు.

error: Content is protected !!