News March 26, 2024
WGL: కాకతీయ మెడికల్ కాలేజ్‌లో బ్రెయిన్ ట్యూమర్ చికిత్స

కాకతీయ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరో సర్జరీ విభాగంలో మొట్టమొదటిసారిగా బ్రెయిన్ ట్యూమర్ చికిత్స చేశారు. హనుమకొండ జిల్లా ఉప్పల్ గ్రామానికి చెందిన బుర్ర స్వరూపకు బ్రెయిన్‌లో ట్యూమర్ ఏర్పడింది. దీంతో ఆమెకు తీవ్రమైన తలనొప్పి, నరాల బాధతో ఆసుపత్రిలో చేరగా న్యూరోసర్జరీ విభాగం హెచ్ఓడీ డా.సికందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సచిన్, వీరేష్ శస్త్రచికిత్స చేశారు.
Similar News
News March 18, 2026
వరంగల్: రెండవ రోజు 99.9 శాతం విద్యార్థులు హాజరు

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల రెండవరోజు వరంగల్ జిల్లాలో మొత్తం 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,482 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 9,473 మంది హాజరు కాగా 9 మంది గైర్హాజయ్యారు. మొత్తంగా హిందీ పరీక్షకు 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంగతులు జరగలేదని డీఈవో రంగయ్య తెలిపారు.
News March 16, 2026
స్త్రీనిధి రుణాలు పక్కదారి.. రూ.1.50 కోట్లు గోల్‌మాల్

వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో స్త్రీనిధి రుణాలు దారి తప్పాయి. మహిళా సంఘాల సభ్యుల నుంచి కిస్తీలు వసూలు చేసిన 50 మంది రిసోర్స్ పర్సన్లు (ఆర్‌పీలు), ఆ సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా సుమారు రూ.1.50 కోట్లు సొంతానికి వాడుకున్నారు. అధికారుల నోటీసులతో అసలు విషయం బయటపడటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధ్యులైన ఆర్‌పీలకు అధికారులు మెమోలు జారీ చేశారు.
News March 16, 2026
WGL: సింహపురి ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

వరంగల్-కాజీపేట స్టేషన్ల మధ్య హంటర్ రోడ్ శాయంపేట రైల్వే గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున సింహపురి ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద ఈనెల 15నాటి ఆర్టీసీ ఎక్స్ రోడ్స్-సికింద్రాబాద్ బస్సు టికెట్, సప్తగిరి థియేటర్ సినిమా టికెట్ లభించాయి. ఇతర గుర్తింపు ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.


