News April 5, 2025
వరంగల్‌లో సన్నబియ్యం పంపిణీ.. BJP, కాంగ్రెస్ వార్

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బియ్యం మేమిస్తున్నామంటే మేమిస్తున్నామని ఓరుగల్లు BJP, కాంగ్రెస్ నాయకుల మధ్య వార్ నెలకొంది. కేంద్రం 5KGలు, రాష్ట్ర ప్రభుత్వం 1KG మాత్రమే ఇస్తుందని BJPనేతలు అంటుంటే.. మొత్తం రాష్ట్రప్రభుత్వమే భరిస్తోందని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటో ఎందుకు పెట్టలేదని BJP నాయకులు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News April 6, 2025
HNK: వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి

వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళతో పాటు వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు. హనుమకొండ బాలసముద్రం అంబేడ్కర్ నగర్‌కు చెందిన రాజీవ్(32) గవిచర్ల రోడ్డులోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. కాశికుండకు చెందిన ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి 2 ఫోన్లు, రూ.1500 స్వాధీనం చేసుకున్నారు.
News April 6, 2025
వరంగల్: జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి

వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీయువకులకు ఈ నెల 11న టాస్క్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న మెగా జాబ్ మేళా పోస్టరును కలెక్టర్ సత్య శారదా దేవి, మేయర్ గుండు సుధారాణితో మంత్రి సురేఖ శనివారం ఆవిష్కరించారు. జిల్లాలో నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
News April 6, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నుంచి నెల రోజుల పాటు 30 సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, ఉరేగింపులు నిర్వహించడం నిషేధించినట్లు చెప్పారు. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా డీజే సౌండ్లను వినియోగించడంపై నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.