News April 5, 2025

భూపాలపల్లి వాసులూ.. APPLY చేశారా..?

image

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను భూపాలపల్లిలోని MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE

Similar News

News November 7, 2025

ఏటా 5-10% పెరగనున్న ఇళ్ల ధరలు

image

ప్రస్తుతం దేశంలో ఏటా ఇళ్ల అమ్మకాలు 3-4L యూనిట్లుగా ఉండగా 2047 నాటికి రెట్టింపవుతాయని CII, కొలియర్స్ ఇండియా అంచనా వేశాయి. భారీ డిమాండ్ వల్ల 2 దశాబ్దాలపాటు ఏటా 5-10% మేర గృహాల రేట్లు పెరుగుతాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ $0.3 ట్రిలియన్లుగా ఉండగా 2047కు $5-10 ట్రిలియన్లకు పెరగొచ్చని తెలిపాయి. మౌలిక వసతులు, రవాణా, వరల్డ్ క్లాస్ నిర్మాణాలు ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డాయి.

News November 7, 2025

త్వరలో గుడివాడకు వందే భారత్ రైలు

image

చెన్నై – విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవను గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరం.

News November 7, 2025

స్కూళ్లకు ఈ రెండో శనివారం నో హాలిడే: DEO

image

ఇటీవల తుఫాను ధాటికి తిరుపతి జిల్లాలో స్కూళ్లకు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా పాఠశాలలు పనిచేయాల్సిన తేదీలను డీఈవో కుమార్ వెల్లడించారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 10, ఫిబ్రవరి 14వ తేదీల్లో పాఠశాలలు కచ్చితంగా పనిచేయాలన్నారు. ఏ పాఠశాలకు ఎటువంటి మినహాయింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.