News April 5, 2025
జనగామ వాసులూ.. APPLY చేశారా..?

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్లైన్లో అప్లై చేసి హార్డ్ కాపీలను జనగామ జిల్లాలోని మీ MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE
Similar News
News November 10, 2025
జాతీయస్థాయి పోటీలకు గుంతకల్లు విద్యార్థిని ఎంపిక

శ్రీకాకుళంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 మహిళా క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. దీంతో జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి ఐదుగురు మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థిని, వికెట్ కీపర్ బట్నపాడు అమూల్య జాతీయస్థాయి జట్టుకు ఎంపికైంది. ప్రిన్సిపల్ సాలాబాయి, కాలేజీ సిబ్బంది, పలువురు క్రీడాకారులు ఆమెను అభినందించారు.
News November 10, 2025
నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న అజహరుద్దీన్

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గత నెల 31న ప్రభుత్వం ఆయన గవర్నర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అజహరుద్దీన్‌కు ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను కేటాయించింది. ఆయనతో కలుపుకొని ప్రస్తుతం క్యాబినెట్ మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఇంకా రెండు ఖాళీలు ఉన్నాయి.
News November 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 10, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.04 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


