News April 5, 2025
సూర్యాపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ వివరాలు.. గరిడేపల్లి మండలం కల్మల్‌చుర్వు గ్రామానికి చెందిన సైదులు(53) హనుమంతులగూడెంకి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘనటలో సైదులు స్పాట్‌లోనే మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 6, 2025
వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాకు వర్ష సూచన, పిడుగులు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారుల సెలవులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ రద్దు చేశారు. వచ్చే 48 గంటల పాటు కలెక్టరేట్‌లో 08942-20557 ఫోన్ నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోంపేట మండలంలో అధిక వర్షపాతం పడే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించారు.
News April 6, 2025
భద్రాచలానికి సీఎం రాక.. భారీ బందోబస్తు

భద్రాచలానికి సీఎం రేవంత్ రానున్న నేపథ్యంలో బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ హెలిపాడ్ గ్రౌండ్ వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 2000 మంది పోలీస్ సిబ్బందితో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఉదయం 10.45 గంటలకు భద్రాద్రి ఆలయానికి సీఎం రానున్నారు.
News April 6, 2025
HYD: హనుమంతుడు లేని రామాలయం!

అతి పురాతన ఆలయం మన HYD శివారులో ఒకటుంది. శంషాబాద్ మం. పరిధిలో 13వ శతాబ్దంలో వేంగీ చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించి, శ్రీ లక్ష్మణ సమేత సీతారామచంద్రస్వామి ఏకశిల రాతి విగ్రహాలు నెలకొల్పారు. సీతమ్మవారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి ‘అమ్మపల్లి’అనే పేరు వచ్చిందని నానుడి. గర్భగుడిలో హనుమంతుడి విగ్రహం లేని అరుదైన రామ మందిరం ఇది. ఇక్కడి నుంచే రాముడు ఒంటిమిట్టకు వెళ్లినట్లు పెద్దలు చెబుతారు.