News April 5, 2025
విశాఖ తీరంలో అమెరికా యుద్ధ విన్యాసాలు

విశాఖ తీరానికి సైనికులతో ఉన్న అమెరికా దేశ యుద్ధ నౌకలు వచ్చాయి. ఇండో పసిఫిక్ ప్రాంతం భద్రతకు దిక్సూచిగా భారత్- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంఫ్ 2025 విన్యాసాల్లో పాల్గొనడానికి విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఈ నెల ఏడో తేదీ వరకు హార్బర్ ఫేజ్‌లో విన్యాసాలు జరుగుతాయి. అమెరికా యుద్ధనౌక యూఎస్ కంస్టాక్, రాల్స్ జాన్సన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Similar News
News April 6, 2025
మా చిత్రాన్ని విజయవంతం చేయండి: సిద్ధు, వైష్ణవి

ఈనెల 10న తమ లేటెస్ట్ సినిమా “జాక్” థియేటర్లలో రిలీజ్ అవుతోందని, మూవీని ఆదరించాలని హీరో సిద్ధు, హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రేక్షకులను కోరారు. శనివారం ఈ సినీ నిర్మాత DVS ప్రసాద్‌తో కలసి విజయవాడలో వారు మాట్లాడుతూ..”జాక్”లో ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయన్నారు. కామెడీ, లవ్, యాక్షన్ సన్నివేశాలతో డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారన్నారు.
News April 6, 2025
టాప్ 10లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్రంలో పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో టాప్ టెన్ ఎమ్మెల్యేల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చోటు సంపాదించుకున్నారు. పీపుల్స్ పల్స్ సంస్థ సౌత్ ఫస్ట్ వెబ్ ద్వారా 2024 మార్చి 28 నుంచి ఏప్రిల్ 3 వరకు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేశారు. ఇందులో ఆదిలాబాద్ ఎమ్మెల్యే 8వ స్థానంలో నిలిచారు. నియోజకవర్గంలో 450 నుంచి 500 శాంపిల్స్ సేకరించినట్టు సంస్థ తెలిపింది.
News April 6, 2025
HYD: శోభాయాత్ర.. ఈ రూట్‌లు బంద్!

శ్రీ రామనవమి శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని HYD పోలీసులు తెలిపారు. సౌత్ వెస్ట్ జోన్‌లో 9AM నుంచి 4PM వరకు, ఈస్ట్ జోన్‌లో 2PM నుంచి 9PM వరకు ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది. 20 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, MJ మార్కెట్, పుత్లీబౌలి మీదుగా సుల్తాన్‌బజార్‌కు ర్యాలీగా వెళ్తారు. ప్రత్యామ్నాయ రూట్‌లో వెళ్లాలని పోలీసులు సూచించారు.SHARE IT