News April 5, 2025
శ్రీరామనవమి వేళ.. వరంగల్ ట్రైసీటీలో పోలీసుల నజర్

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శ్రీరామ మందిరాలతోపాటు, వాడల్లో ప్రజలు జరుపుకునే శ్రీరాముని కళ్యాణ వేడుకలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించాలని వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. రామ మందిరాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శోభాయాత్ర సమయంలో పోలీసులు తగు బందోబస్త్ ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News April 6, 2025
కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

కరీంనగర్ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కరీంనగర్ జిల్లా కేంద్రం, ఇల్లందకుంట మండలంలో 40.1°C నమోదు కాగా, జమ్మికుంట 40.0, మానకొండూర్ 39.9, గంగాధర 39.8, రామడుగు 39.6, చొప్పదండి 39.4, కొత్తపల్లి 39.3, చిగురుమామిడి 39.2, వీణవంక 39.1, సైదాపూర్ 39.0, గన్నేరువరం 38.9, శంకరపట్నం 38.7, తిమ్మాపూర్ 38.5, హుజూరాబాద్ 38.4, కరీంనగర్ రూరల్ 38.3°C గా నమోదైంది.
News April 6, 2025
మెదక్: ఇద్దరు యువకుల గల్లంతు

మెదక్ మండలం బాలానగర్ మత్తడిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తుడుం నవీన్(21), తుడుం అనిల్(22) శనివారం సాయంత్రం స్నానానికి వెళ్లారు. ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతకగా ఈరోజు ఉదయం చెరువు కట్టపై చెప్పులు, బట్టలు కనిపించాయి. దీంతో యువకుల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
News April 6, 2025
మా చిత్రాన్ని విజయవంతం చేయండి: సిద్ధు, వైష్ణవి

ఈనెల 10న తమ లేటెస్ట్ సినిమా “జాక్” థియేటర్లలో రిలీజ్ అవుతోందని, మూవీని ఆదరించాలని హీరో సిద్ధు, హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రేక్షకులను కోరారు. శనివారం ఈ సినీ నిర్మాత DVS ప్రసాద్‌తో కలసి విజయవాడలో వారు మాట్లాడుతూ..”జాక్”లో ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయన్నారు. కామెడీ, లవ్, యాక్షన్ సన్నివేశాలతో డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారన్నారు.