News March 26, 2024

ఆటగాడిని చెత్తతో పోల్చిన మాజీ క్రికెటర్.. స్పందించిన RCB

image

నిన్న PBKSతో మ్యాచ్ సందర్భంగా RCB బౌలర్‌ యశ్ దయాల్‌పై కామెంటేటర్ మురళీ కార్తీక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఒకరి చెత్త.. మరొకరికి నిధిలా మారుతుంది’ అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు ఫైరవుతున్నారు. ఈ అంశంపై RCB స్పందిస్తూ.. ‘అవును.. అతను మా నిధే’ అని రిప్లై ఇచ్చింది. గత సీజన్‌లో GT తరఫున ఆడిన దయాల్ ఓవర్లో రింకూ సింగ్(KKR) 5 సిక్సులు బాదిన విషయం తెలిసిందే.

Similar News

News March 18, 2026

సాంగ్ వివాదం.. క్షమాపణలు చెప్పిన మంగ్లీ

image

పాన్ ఇండియా మూవీ ‘KD: ది డెవిల్’లో తాను పాడిన <<19406830>>పాటపై<<>> తలెత్తిన వివాదంపై సింగర్ మంగ్లీ SM వేదికగా క్షమాపణలు చెప్పారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఆ పాటను అన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించినట్లు ఆమె పేర్కొన్నారు. ఎవరినీ నొప్పించడం తమ ఉద్దేశం కాదన్నారు. సవరించిన లిరిక్స్‌తో కొత్త వెర్షన్‌ను ఇవాళ విడుదల చేస్తామని తెలిపారు. అలాగే ఈ పాటలో నటించిన నోరా ఫతేహి కూడా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు.

News March 18, 2026

డొమెస్టిక్ LPG ఉత్పత్తి 40% పెరిగింది: కేంద్రం

image

LPG కొరత నేపథ్యంలో వినియోగదారులు PNGలోకి మారాలని కేంద్రం మరోసారి సూచించింది. LPG సమస్య ఉన్నా ఎక్కడా గ్యాస్ లభ్యత పూర్తిగా ఆగిపోలేదని తెలిపింది. LPG ఉత్పత్తి 40% పెరిగిందని పేర్కొంది. క్రూడ్, పెట్రోల్, డీజిల్ లభ్యత సాధారణంగానే ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రాలు/యూటీలకు అదనంగా 10% కమర్షియల్ LPGని కేటాయిస్తున్నామని.. ఇది భవిష్యత్తులో ఆ ప్రాంతాల్లో LPG నుంచి PNGకి మారేందుకు సహాయపడుతుందని తెలిపింది.

News March 18, 2026

OFFICIAL: SRH కెప్టెన్‌గా ఇషాన్

image

IPL-2026 ప్రారంభంలోని కొన్ని మ్యాచులకు యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని SRH ప్రకటించింది. అలాగే అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా ఉంటారని పేర్కొంది. పాట్ కమిన్స్ వెన్నునొప్పి గాయం నుంచి కోలుకున్న తర్వాత జట్టులో చేరుతారని తెలిపింది. దీంతో ఈనెల 28న RCBతో జరిగే తొలి మ్యాచ్‌లో కిషన్ జట్టును నడిపించనున్నారు.